అమిత్ షా మాటలను మరోసారి నరేంద్రమోదీ రిపీట్ చేశారు అంతే.. అంటూ.. ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. నిన్న జరిగిన మోడీ హైదరాబాద్ పర్యటలో భాగంగా.. సీఎం కేసీఆర్ కుటుంబ పాలనపై మోడీ ప్రస్తావించడంతో.. టీఆర్ ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పందించారు. మోడీ మాటలకు ఈ సందర్భంగా చురకలంటించారు. నరేంద్రమోదీ మాటలను టీఆరెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు.
తెలంగాణ ఏర్పాటుకు నరేంద్రమోదీ పచ్చివ్యతిరేకి అంటూ మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు రాష్ట్రం కోరుకుంటున్నారని మోదీ చెప్పారు. కానీ.. తెలంగాణ ప్రజలు ఎప్పుడూ కోరుకోలేదని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడిన తరువాత కూడా తెలంగాణ ఏర్పాటుపై మోడీ విషం చిమ్మారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్ సిఫార్సులను మోడీ ఎప్పుడూ పట్టించుకోలేదని గుర్తు చేశారు.
బీజేపీ నాయకులు వారి వారసులు కేంద్రమంత్రులుగా ఉన్నారని గుర్తు చేశారు. ఆయా రాష్ట్రాల్లో రాజకీయాల్లో ఉన్నది నిజం కాదా? అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం తాగ్యాల కుటుంబం- బీజేపీ లాగా బోగాల కుటుంబం కాదంటూ విమర్శించారు. యువత అని మోడీ నోట వచ్చింది…మరి ఆ యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? అని ప్రశ్నించారు.
RSS- BJP శిక్షణా శిబిరాల్లో కత్తులు- తుపాకులు పట్టిస్తున్నారని నిప్పులు చెరిగారు. వ్యాక్సిన్ సర్టిఫికెట్స్ పై మోడీ పోటో పెట్టుకోవడం కాదు, కరోనాతో మరణించిన వారి డెత్ సర్టిఫికెట్స్ పై ఫోటో పెట్టుకోవాలంటూ మండిపడ్డారు. భారతదేశంలో చాలామందిని చూసింది..అందరూ పోయారు…మోడీ పోయే రోజులు వస్తాయని ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Karate Kalyani: మళ్ళీ తెరపైకి కరాటే కళ్యాణి.. వారిపై ఫిర్యాదు !