ప్రపంచంలో పాల ఉత్పత్తిలో దేశం నెంబర్ గా ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. డబ్బా ఇల్లు వద్దు అన్న తెలంగాణ ప్రభుత్వం.. 8 ఏళ్లలో ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో ఎన్ని ఇళ్ళు కట్టినా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని విమర్శించారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధిని 21 వేల కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాల్లో వేశారని గుర్తు చేశారు.
దేశ జీడీపీ పెరిగింది..ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగిందన్నారు. పేద దేశాలకు ఆహార ధాన్యాలు పంపిస్తున్నామని గుర్తు చేశారు. సేంద్రియ వ్యవసాయం కోసం చర్యలు తీసుకుటోందని తెలిపారు. వ్యవసాయ రంగంలో డ్రోన్ ల వినియోగం ప్రోత్సహిస్తున్నామన్నారు. ల్యాండ్ రికార్డ్ ల ఆధునీకరణ కోసం కేంద్రం ప్రత్యేక నిధులు విడుదల చేసిందన్నారు. వరి ధాన్యం కనీస మద్దతు ధర కేంద్రం 1940 రూపాయలకు పెంచిందని గుర్తు చేశారు.
తెలంగాణలో ధాన్యం సేకరణ కోసం 2014లో 3400 కోట్లు కొనుగోలు చేసేది.. ప్రస్తుతం 26,600 కోట్ల రూపాయలు కేంద్రం ఖర్చుచేస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 2014కు ముందు ఎరువుల కొరత, నాణ్యమైన విత్తనాలు దొరికేవి కావని, నానో యూరియా దిగుబడి పెంచుకునేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. మోడీ ప్రభుత్వం 23 రకాల పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించిందని హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదని, కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎన్ని రోజులు ఫార్మ్ హౌస్ లో ఉంటారో.. ఎన్ని రోజులు ప్రగతి భవన్ లో ఉంటారో తెలియదని ఎద్దేవ చేశారు. మోడీ పాలనలో ఒక్క పేలుడు ఘటన కూడా జరగలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో హైదరాబాద్ బాంబు పేలుళ్ల ఘటనను గుర్తు చేస్తూ ఈవాఖ్యలు చేశారు.
Kuwait: నన్ను భారత్‌కు రప్పించండి.. చిత్రహింసలు పెడుతున్నారు