తెలంగాణ బీజేపీకి తొమ్మిది మంది అధికార ప్రతినిధులు ఉన్నారు. ఇందులో ముగ్గురు గతంలో నియమితులు కాగా.. రీసెంట్ గా మరో ఆరుగురునీ నియమించారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. అధికార ప్రతినిధుల ప్రధాన బాధ్యత.. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల పై, సంఘటనల పై స్పందించడం… వివిధ అంశాల పై పార్టీ వైఖరి ఏంటో చెప్పడం. దీంతో పాటు సీనియర్ నేతల మీడియా సమావేశాలు ఉంటే.. ముందే మెటీరియల్ సమకుర్చడం.. బ్యాక్ ఆఫీసు సపోర్ట్ గా ఉండటం. అయితే అధికార ప్రతినిధులలో ఎక్కువ మంది తాము చేయాల్సిన పని చేయడం లేదనే అభిప్రాయం పార్టీలో వ్యక్తం అవుతోంది. గతంలో అధికార ప్రతినిధులు రెగ్యులర్ గా సమావేశం అయ్యేవారు. వివిధ అంశాల పై ఇంటర్నల్ గా డిస్కస్ చేసుకునే వారు. కరెంట్ ఇష్యూ స్ పై పార్టీ లైన్ ఏంటనే దాని అందరికీ క్లారిటీ వచ్చేది. ఇప్పుడు అలా సమావేశాలు రెగ్యులర్ గా జరగడం లేదు. ఒక వేళ సమావేశాలు అప్పుడప్పుడూ జరిగినా.. అందరూ అటెండ్ కావడం లేదు.
పార్టీ అధికార ప్రతినిధుల తీరు పై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారట. జరుగుతున్న డెవెలప్ మెంట్స్ పై వెంటనే స్పందించాలని చెప్పినా ఎందుకు పట్టించుకోవడం లేదని అడిగారట. ఎందుకు సమన్వయం చేసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఇకపై జరుగుతున్న సంఘటనలపై వెంటనే స్పందించాలని, అలెర్ట్ గా ఉండాలని సూచించారట. సమాచార సేకరణలో అధికార ప్రతినిధులు నిర్లిప్తంగా ఉండొద్దని అన్నారట. TRS పార్టీ నేతలు బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంటే వెంటనే కౌంటర్ ఇవ్వడం లేదని క్లాస్ తీసుకున్నారట. 9 మంది అధికార ప్రతినిధులున్నా ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండడం లేదని.. రోజూ ఒకరు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండాలని ఆదేశించారట. జిల్లాల్లో జరిగే ఘటనలపై స్థానిక నేతలను అప్రమత్తం చేయడం వెంటనే వారికి పార్టీ లైన్ ఏంటో చెప్పాలని సూచించారట.
బండి సంజయ్ ఆదేశాలు అటుంచితే.. అధికార ప్రతినిధులలో ఎక్కువ మంది పార్టీకి కొత్త. చొరవ తీసుకోవడం లో కొద్దిగా వెనుకా,ముందు ఆడుతున్నారట. ఇప్పుడు బండి సంజయ్ వారికి దిశానిర్దేశం చేయడంతో.. ఇక ముందు వాళ్లు ఎలా యాక్టివ్ అవుతారో చూడాలి.