Bandi Sanjay: సీఎం అవినీతితో తెలంగాణను అప్పుల పాలు చేశారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ మాటలను, నాయకులు, అధికారుల మాటలను పట్టించుకునే పరిస్థితి లేదని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ విమర్శించారు. బొగ్గు దిగుమతి అంశంలో కేసీఆర్ ప్రజలను పక్కదోవ పట్టించారని అన్నారు. రాష్ట్రం ముఖ్యమంత్రి విచ్చల విడి అవినీతితో తెలంగాణను అప్పు ల పాలు చేశారని.. ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేసే పరిస్థితి లేదని ఆరోపించారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగం సంస్థల నుంచి అప్పులు తెచ్చాడని.. కొత్తగా అప్పులు వచ్చే పరిస్థితి లేదని ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు.
24 గంటల ఉచిత విద్యుత్ పేరిట పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి రూ. 60 వేల కోట్ల రూపాయలను డిస్కంలకు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి అని అన్నారు. పాతబస్తీలో ఏడాదికి రూ. 1000 కోట్లను వసూలు చేయడం లేదని అన్నారు. కేసీఆర్ ఫామ్ హౌజ్ లో సపరేట్ సబ్ స్టేషన్ పెట్టుకుని వందల ఎకరాలకు ఉచిత కరెంట్ వాడుకుంటున్నారని విమర్శించారు. 40 గ్రామాలకు ఉపయోగించే విద్యుత్ ను ఫామ్ హౌజ్ కే వాడుతున్నారని ఆరోపించారు.
Also Read
- CM Revanth: కమ్యూనిస్టుల పోరాటం.. కాంగ్రెస్ పరిష్కారం.! సీఎం కీలక వ్యాఖ్యలు..
- Bhatti Vikramarka: సింగరేణి 128 మంది ఉద్యోగుల భవితవ్యంపై నిర్ణయం.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన.!
- Uttam Kumar Reddy: పాదయాత్ర అంటే జనాలు నవ్వుతారు.. కేసీఆర్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు.!
- Auto Drivers Meet: ఆటో కార్మికులతో కీలక భేటీ.. సంక్షేమ బోర్డు, మీటర్ ఛార్జీలపై చర్చ!
రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ఉద్యోగాలిప్పిస్తానని టీఆర్ఎస్ నేతలు ఎంతో మంది యువకుల నుండి కోట్లాది రూపాయలు దండుకున్నారని ఆరోపించారు. ఉద్యోగాలిచ్చే పరిస్థితి లేకపోవడంతో వారంతా తిరగబడుతున్నారని గ్రహించి కాలుష్యం పేరుతో ఏకంగా ఫ్యాక్టరీనే మూసివేయించారని విమర్శించారు. ఎక్కడ బీజేపీకి పేరు వస్తుందో అని అక్కసుతోనే ఎరువుల ఫ్యాక్టరీని మూసేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక వేళ మీటర్లు పెడితే టీఆర్ఎస్ నాయకుల బండారం బయటపడుతుందని.. అందుకే మోటర్ల దగ్గర మీటర్లు పెడుతున్నారని బీజేపీని బద్నాం చేశాడని విమర్శించారు. రూ.3కే దొరికే యూనిట్ కరెంట్ ను రూ. 6కు కొని కమీషన్ల రూపంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడని ఆరోపించారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ అనేది పెద్ద కుంభకోణం అని ఆరోపించారు. దేశాన్ని కరెంట్ కష్టాల నుంచి బయటపడేలా చేసింది బీజేప ప్రభుత్వమే అని అన్నారు. అన్ని పథకాలను కేంద్రమే చేస్తుంటే టీఆర్ఎస్ తమవిగా చెప్పుకుంటున్నారని విమర్శలు చేశారు.
తాజావార్తలు
-
Gold Spot Glimpse: 90s రోజులు గుర్తొచ్చేలా ‘గోల్డ్ స్పాట్’ ఫస్ట్ లుక్ గ్లింప్స్ అవుట్..
-
CM Vijay: పోలీసులు పవర్ సెంటర్‌గా మారొద్దు.. తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ కీలక వ్యాఖ్యలు
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
CM Revanth: కమ్యూనిస్టుల పోరాటం.. కాంగ్రెస్ పరిష్కారం.! సీఎం కీలక వ్యాఖ్యలు..
-
Shaque: అనుమానాలతో పిచ్చెక్కించడానికి వస్తున్న పరిణీతి చోప్రా మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!