Bandi Sanjay: గ్రామ సర్పంచ్‌లకు మూడు పేజీల బహిరంగ లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ లేఖాస్త్రాన్ని ఉపయోగిస్తున్నారు. బహిరంగంగానే లేఖల రాసి టీఆర్ఎస్ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారు. ఇటీవలె మే 29 న సీఎం కేసీఆర్ కు గిరిజనులకు పోడు భూములపై హక్కులు ఇవ్వాలని, పోడు భూముల సమస్య పరిష్కరించకుండా హరితహారం నిర్వహించడం గిరిజనులను వంచించడమేనని విమర్శిస్తూ బండి సంజయ్ లేఖ రాసిన విషయం తెలిసిందే.
అయితే.. ఇవాళ టిఆర్ ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ గ్రామ సర్పంచ్‌లకు మూడు పేజీల బహిరంగ లేఖ రాశారు బండిసంజయ్. 73, 74 రాజ్యాంగ అధికరణలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని మండిపడ్డారు. గ్రామాల స్వశక్తితో అభివృద్ధి పథంలో నడవాలన్నదే ప్రధాన మంత్రి నరేంద్రమోడీ లక్ష్యం మని పేర్కొన్నారు. న్యాయమైన డిమాండ్ల కోసం గ్రామ సర్పంచ్‌లు చేసే ఆందోళనలకు బిజెపి సంపూర్ణ మద్దతు ఇస్తుందని భరోసా ఇచ్చారు. గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన పెండింగ్ లో వున్న బిల్లులు వెంటనే విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
Also Read
సర్పంచ్‌ల పట్ల జిల్లా అధికారుల వేధింపులు ఆపాలి మండిపడ్డారు. గ్రామాలకు రావాల్సిన పెండిండ్ బిల్లులు, గ్రామసర్పంచ్‌ల హక్కులు పరిరక్షణ కోసం త్వరలోనే బిజెపి శాఖ మౌనదీక్ష చేపడుతుందని హెచ్చారించారు. పంచాయతీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను రాష్ట్రం పక్కదారి పట్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 లో టీఆర్‌ఎస్ పార్టీ ‘‘గ్రామీణాభివృద్ధి ` పంచాయతీరాజ్ వ్యవస్థ’’ అనే అంశం కింద ఇచ్చిన హామీలకు తిలోదకాలు ఇచ్చింది బండి సంజయ్ విమర్శించారు. సర్పంచ్‌లు ఆత్మహత్యలకు పాల్పడవద్దని, అధైర్యపడవద్దని. మీకు అండగా బిజెపి ఉంటుందని భరోసా ఇచ్చారు.
గ్రామ సర్పంచ్‌లు, స్థానికసంస్థల ప్రజాప్రతినిధులు సగర్వంగా తలెత్తుకునేలా చేసే బాధ్యత బిజెపిది అంటూ బండి సంజయ్ ఆత్మ విశ్వాశాన్ని నింపారు. గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం.. గ్రామస్వరాజ్యం సాదిద్దాం.. రామరాజ్యాన్ని నిర్మించుకుందాం అంటూ బండి సంజయ్ పిలుపు నిచ్చారు.
తాజావార్తలు
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
-
Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
-
Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్‌లో బీజేపీకి పరీక్ష
-
Tilak Varma: ఆ పొజిషన్లో బ్యాటింగ్ చేయడమే ఇష్టం.. కానీ తప్పడం లేదు!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!