కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ఇంచార్జ్ మంత్రి కొప్పుల ఈశ్వర్ పలు అభివృద్ధి పనులకు 31.30కోట్ల రూపాయలతో అంబేద్కర్ చౌక్, గాంధీ చౌక్, రైల్వే స్టేషన్ షాపింగ్ కాంప్లెక్స్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సంధర్బంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ… దేశంలో రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చిన మొఖమా బీజేపీ నాయకులది. రెండు వేలు ఇవ్వలేని వాళ్ళు రూ.50లక్షలు కావాలని డిమాండ్ చేయడం సిగ్గు చేటు. జీహెచ్ఎమ్ సి ఎన్నికల్లో బండి సంజయ్ ఏం మాట్లాడిండు.…
బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ టీఆర్‌ఎస్ పై ఫైర్ అయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ లో రోడ్లు అద్వాన్నంగా తయారు అయ్యాయని.. చిన్న వర్షానికే వాటర్ జమ అవుతుంది… అందులో పడి చనిపోతున్నారని మండిపడ్డారు. హుజూరాబాద్ ఎన్నికల కోసం ఉత్తుత్తి స్కీమ్ లు పెడుతున్నారని.. అక్కడ టీఆర్‌ఎస్ గెలిచే పరిస్థితి లేదని చురకలు అంటించారు. అయ్యా, కొడుకులు ఒకసారి బైక్ మీద తిరిగితే రోడ్ల పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుందని ఫైర్ అయ్యారు.. గ్రేటర్ కమిషనర్ ని అడిగితే…
అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు.. అధికారుల మధ్య అవగాహన ఉన్నంతకాలం ఎలాంటి గొడవలు రావు. తేడా కొట్టిందో.. రచ్చ రచ్చే. ఆ జిల్లాలో ప్రస్తుతం అధికారపార్టీ ఎమ్మెల్యేకు.. జిల్లా ఎస్పీకి మధ్య అదే జరుగుతోందట. తమ పని తప్ప మరో అంశం పట్టని ఇద్దరికీ ఎక్కడ చెడిందనే చర్చ మొదలైంది. ఇంతకీ వారెవరు? రగడ రాజేసిన బిచ్కుంద పోలీస్‌స్టేషన్! ఈయన కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే. ఇక శ్వేతారెడ్డి ఆ జిల్లా ఎస్పీ. బిచ్కుంద పోలీస్‌స్టేషన్…
ఎంకిపెళ్లి సుబ్బిచావుకు రావడం అంటే ఇదే. ఏదో ఆశించి ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తే.. అది అధికారపార్టీలోని మిగిలిన ఎమ్మెల్యేలను ఇరకాటంలో పడేసిందట. ‘రాజీనామా చేయండి సార్..!’ అంటూ.. సోషల్ మీడియాలో చేస్తున్న ట్రోలింగ్‌తో శాసనసభ్యులకు తలబొప్పి కడుతోందట. అదేంటో లెట్స్ వాచ్! హుజురాబాద్‌లో దళితబంధు పైలెట్ ప్రాజెక్టు దళితుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ స్కీమ్‌పై వివిధ వర్గాలతో సమాలోచనలు చేశారు సీఎం కేసీఆర్. పథకాన్ని పట్టాలెక్కించే పనిలో…
అధికార పార్టీలోకి వెళ్లితే ఐదేళ్లు ఢోకా ఉండదని ఎన్నో లెక్కలు వేసుకున్నారు ఆ ఎమ్మెల్యే. కేబినెట్‌లో చోటు దక్కుతుందని గంపెడాశలతో ఉన్నారు. ఇంతలో మారిన రాజకీయ పరిణామాలతో ఆయనకు నిద్రకరువైందట. ఉన్న పార్టీలోని కేడర్ ఎమ్మెల్యేను ఓన్ చేసుకోవడం లేదట. ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపించిన వాళ్లేమో కత్తులు నూరుతున్నారు. ఇప్పుడు వాళ్లూ..వీళ్లూ కలిసిపోవడంతో కంగారెత్తిపోతున్నారట ఆ ఎమ్మెల్యే. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. గండ్ర లక్ష్యంగా భూపాలపల్లిలో రాజకీయ వేడి! శత్రువుకు శత్రువు మిత్రుడు. భూపాలపల్లిలో రాజకీయం…
తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద బడుగుల ఆత్మగౌరవ పోరు ధర్నా జరిగింది. ఈ ధర్నాసభలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పలు విమర్శలు చేశారు. 2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే ప్రగతి భవన్‌ను, ఫామ్ హౌస్‌ను లక్ష నాగళ్లతో దున్నుతామని, ఆ భూమిని ప్రజలకు పంచుతామని అన్నారు. పోడు భూములను పరిష్కరిస్తామని చెప్పిన కేసీఆర్, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. దళితులకు మూడు ఎకరాల భూమిని…
ఫలితం అనుకూలంగా ఉంటే అంతా మా కృషే అని చంకలు గుద్దుకుంటారు. తేడా కొడుతుందని అనుమానం వస్తే మాత్రం దూరం జరుగుతారు. హుజురాబాద్ ఉపఎన్నిక విషయంలోనూ ఆ పార్టీలో అదే జరుగుతోందట. టచ్‌మీ నాట్ అన్నట్టు ఉంటున్నారట నాయకులు. ఆ సంగతేంటో ఈ స్టోరీలో చూద్దాం. హుజురాబాద్‌పై చర్చకు ఇష్టపడని కాంగ్రెస్ నేతలు! తెలంగాణ కాంగ్రెస్‌లో ఎప్పుడూ ఎదో ఒక పంచాయితీ ఉంటూనే ఉంటుంది. సభలు సమావేశాలపై తమకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు? మీరు అలా ఎలా…
మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి .. నేడు టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. తెలంగాణభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నారు. తన అనుచరులు, కార్యకర్తలు, నాయకులతో సీఎం సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు పెద్దిరెడ్డి ఇప్పటికే తెలిపారు.కేసీఆర్ సర్కార్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నానన్నారు పెద్దిరెడ్డి.హుజూరాబాద్‌లో ఈటలకు బీజేపీ అధిష్ఠానం అధిక ప్రాధాన్యమివ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల పెద్దిరెడ్డి రాజీనామా చేశారు. read also : భారత్ ఘోర పరాజయం.. సిరీస్…
కోమటిరెడ్డి బద్రర్స్‌పై మరోసారి ఫైర్ అయ్యారు తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి.. సూర్యాపేటలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిని చూసి సొంత నియోజకవర్గ ప్రజలే చీదరించుకుంటున్నారని వ్యాఖ్యానించారు.. కోమటిరెడ్డి బ్రదర్స్.. ప్రజల్లో ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయారన్న ఆయన.. మీడియా ప్రచారం కోసమే వారి ఆర్భాట౦.. కానీ, ప్రజలకు సేవ చేయాలనే సోయి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.. వారి ధ్యాస డబ్బు సంపాదన పైనే ఉంటుంది.. కానీ, పనులు చేయడంలో ఉండదన్న…