బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ టీఆర్‌ఎస్ పై ఫైర్ అయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ లో రోడ్లు అద్వాన్నంగా తయారు అయ్యాయని.. చిన్న వర్షానికే వాటర్ జమ అవుతుంది… అందులో పడి చనిపోతున్నారని మండిపడ్డారు. హుజూరాబాద్ ఎన్నికల కోసం ఉత్తుత్తి స్కీమ్ లు పెడుతున్నారని.. అక్కడ టీఆర్‌ఎస్ గెలిచే పరిస్థితి లేదని చురకలు అంటించారు.
అయ్యా, కొడుకులు ఒకసారి బైక్ మీద తిరిగితే రోడ్ల పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుందని ఫైర్ అయ్యారు.. గ్రేటర్ కమిషనర్ ని అడిగితే ఫండ్స్ లేవు అని అంటున్నారు… నేనే నెలకు కోటి రూపాయల అప్పు కడుతున్నానని చెబుతున్నాడని ఎద్దేవా చేశారు. బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణను చేశారని… ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని హుజురాబాద్‌లో ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. ఇప్పుడు ఓట్లు అడిగితే… ప్రజలు తిప్పి తిప్పి కొడతారని హెచ్చరించారు.