కోమటిరెడ్డి బద్రర్స్‌పై మరోసారి ఫైర్ అయ్యారు తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి.. సూర్యాపేటలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిని చూసి సొంత నియోజకవర్గ ప్రజలే చీదరించుకుంటున్నారని వ్యాఖ్యానించారు.. కోమటిరెడ్డి బ్రదర్స్.. ప్రజల్లో ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయారన్న ఆయన.. మీడియా ప్రచారం కోసమే వారి ఆర్భాట౦.. కానీ, ప్రజలకు సేవ చేయాలనే సోయి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.. వారి ధ్యాస డబ్బు సంపాదన పైనే ఉంటుంది.. కానీ, పనులు చేయడంలో ఉండదన్న జగదీష్ రెడ్డి… కోమటిరెడ్డి బ్రదర్స్ కు విజ్ఞత ఉంటే.. అభివృద్ధికి సహకరించాలి, లేదంటే సొంత నియోజకవర్గ ప్రజల నుంచే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. మరోవైపు.. ఈ మధ్యే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై విరుచుకుపడ్డ విద్యుత్ శాఖ మంత్రి.. వ్యక్తిగత విమర్శలకు పాల్పడితే ఇకపై ఊరుకునేది లేదని.. ఎక్కువ మాట్లాడితే బట్టలు ఊడదీస్తానని హెచ్చరించారు. ఇప్పటివరకు తాను ఎవరి జోలికి వెళ్లలేదని అనవసరంగా తనతో పెట్టుకుంటే సహించేది లేదని అన్నారు. మీరు భయపెడితే భయపడడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులం కాదని కౌంటర్ ఎటాక్ చేసిన సంగతి తెలిసిందే.