ముక్కు నేలకు రాసి ఈటల క్షమాపణలు చెప్పాలి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈటల రాజేందర్ బావమరిది దళితులపై చేసిన వ్యాఖ్యలకు.. ఈటల రాజేందర్ ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు మోత్కుపల్లి నర్సింహులు.. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. 40 ఎకరాల అసైన్డ్ భూములు లాక్కున్న ఈటలకు పుట్టగతులు ఉండవని హెచ్చరించారు.. ఈటలను హుజురాబాద్‌లో ప్రజలు బహిష్కరించాలని పిలుపునిచ్చిన మోత్కుపల్లి.. ఈటల బావమరిది దళితులను బూతులు తిట్టడం సరికాదని.. ఫ్యూడల్ మనస్తత్వం ఉన్న ఈటలను ప్రజలు నమ్మొద్దని కోరారు.. ఇక, ఈటల ఆక్రమించిన దళితుల భూముల్లో జెండాలు పాతుతామని ప్రకటించిన ఆయన.. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి దళిత బంధుకు మద్దతుగా ప్రచారం చేస్తా.. ఈటల మోసాలపై ప్రజల్లో చైతన్యం తీసుకువస్తానన్నారు.. ఇప్పటికైనా దళితుల భూమిని ఈటల వాపస్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
మరోవైపు.. దళిత బంధును అడ్డుకోవడం సరికాదన్నారు మోత్కుపల్లి.. సీఎం కేసీఆర్ ను అందరూ బలపర్చాలని విజ్ఞప్తి చేసిన ఆయన.. ఈ పథకం గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారికి గ్రామాల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు.. సమసమాజ స్థాపన జరగాలి.. ఒక దళితునికి పది లక్షల ఇస్తానని చెప్పిన దేశంలో ఏకైక మొనగాడు కేసీఆరే అన్నారు. ఇక, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన ఆయన.. దళిత పథకాలకు గండి కొట్టే ప్రయత్నం చేస్తున్నారని.. రైతుబంధులాగా దళిత బంధు మంచి పథకం అని ప్రశంసలు కురిపించారు. అట్టడుగు వర్గాల వారికి ఈ పథకం అన్ని రకాలుగా ఉపయోగ పడుతుందన్న మోత్కుపల్లి.. అన్ని రాజకీయ పార్టీలు దళిత బంధును స్వాగతించాలని కోరారు. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కేసీఆర్ కు ఒక్కరికే ఉందన్న ఆయన.. జాతీయ పార్టీలు ఇలాంటి పథకాలు తీసుకు వచ్చే అవకాశమే లేదన్నారు.
Also Read
- OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
- Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
- Off The Record: వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతల్లో నర్సంపేట టెన్షన్ .. ఎందుకంటే ?
- Scholarships : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!