యాదాద్రి భువనాగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. ఈ సందర్భంగా మునుగోడు ఎమ్మెల్యే రాజాగోపాల్ రెడ్డి, మంత్రి జగదీశ్వర్ రెడ్డి లు వేదిక పైకి రాగానే ఇరు వర్గాల కార్యకర్తలు హోరా హోరీగా నినాదాలు చేశారు. మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమాలలో ప్రోటోకాల్ పాటించడం లేదని కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన చేయడంతో… ఇరు పార్టీ కార్యకర్తల నినాదాల మధ్య రసాభాసగా మారింది రేషన్ కార్డుల…
హుజురాబాద్ సిటీ సెంటర్ హల్ లో కేబుల్ ఆపరేటర్స్ – హమాలి సంఘ సభ్యులతో తెలంగాణ మంత్రి గంగుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆపదలో, ఆకలితో ఉన్నవారిని ఆధుకునే మంచిమనుసు సీఎం కేసీఆర్ ది అని.. కేబుల్ ఆపరేటర్లు, హమాలీలను ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటుందని తెలిపారు. అర్హులైన కేబుల్ ఆపరేటర్లకు, హమాలీలకు అతి త్వరలో డబుల్ బెడ్రూం, బీమాసౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు. ఈటెల ఏనాడు హుజురాబాద్ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ను అడగలేదని……
సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ పీసీసీ ఛీప్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హాట్ హాట్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘దళిత బంధు పేరిట దళితులను మరోసారి మోసం చేసేందుకు కేసీఆర్ పథకాన్ని రచించాడు. హుజురాబాద్ ఉప ఎన్నిక కోసమే దళిత బంధు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటి ముఖ్యమంత్రి దళితుడే అన్నాడు. దళితులకు 3 ఎకరాల…
టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై మరోసారి రేవంత్ నిప్పులు చెరిగారు. చివరి దాకా కాంగ్రెస్ జెండా మోసిన వాళ్లే తన బంధువు అని..కష్టపడ్డ వాడే తనకు బంధువు అని పేర్కొన్నారు. మరో 20 నెలలు కాంగ్రెస్ పార్టీ కష్టపడి పని చేయాలని కోరారు. అధికారం లోకి వచ్చిన తర్వాత కష్టపడి పని చేసిన కార్యకర్తల కే పదవులు అని పేర్కొన్నారు. read also : కర్నూలు జిల్లా వైసీపీలో వారసుల హవా! ఉప ఎన్నికలు ఎక్కడ ఉంటే అక్కడ పథకాలు…
కాంగ్రెస్ నుంచి గులాబీ గూటికి చేరిన ఎమ్మెల్యేలు పునరాలోచనలో పడ్డారా? కర్టసీ కోసం టచ్‌లోకి వెళ్తున్నారా.. లేదంటే ముందే కర్చీఫ్ వేసుకుంటున్నారా? అప్పట్లో కాదని వెళ్లిన ఎమ్మెల్యేలు ఇప్పుడు వెనక్కి రావాలని ఎందుకు అనుకుంటున్నారు? లెట్స్ వాచ్! పార్టీ మారిన ఎమ్మెల్యేలు టచ్‌లోకి వస్తున్నారా? తెలంగాణలో కాంగ్రెస్ సింబల్ మీద గెలిచి.. ప్లేట్ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలపై.. కొత్త పీసీసీ చీఫ్ వచ్చి రాగానే మాటల తూటాలు పెంచారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు.. కౌంటర్ అటాక్ చేసినా……
నిప్పు లేనిదే పొగ రాదు. ఆ ప్రాంతంలో మంత్రి తీరుపై ఎమ్మెల్యేల గుస్సా కూడా అలాగే ఉందట. వారికి తెలియకుండా నియోజకవర్గాల్లో వేలు పెడుతున్నారట ఆ మంత్రిగారు. ఇంకేముందీ నిన్న మొన్నటి వరకు సఖ్యంగా ఉన్న ఎమ్మెల్యేలు నారాజ్ అవుతున్నారట. అమాత్యుల వారిని కట్టడి చేసేందుకు పావులు కదుపుతున్నట్టు సమాచారం. అదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మంత్రి మల్లన్న తీరుపై ఎమ్మెల్యేలు గుర్రు! టీఆర్‌ఎస్ ముందస్తు ఎన్నికలకు వెళ్లిన పరిస్థితులలో ఎమ్మెల్యేగా పోటీ చేసి మేడ్చల్‌లో…
కాళ్లు, రెక్కలు మాత్రమే ఆస్తులుగా కలిగిన దళిత కుటుంబాలే మొదటి ప్రాధాన్యతగా ‘దళిత బంధు పథకం’ రాష్ట్రవ్యాప్తంగా అమలు జరుగుతుందని, అర్హులైన దళితులందరికీ దళిత బంధు పథకం అమలు చేస్తామని, దశలవారీగా అమలు చేసే ఈ పథకం కోసం రూ.80 వేల కోట్ల నుంచి రూ. 1 లక్ష కోట్ల వరకు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. హుజూరాబాద్ లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమయ్యే దళిత బంధు కేవలం తెలంగాణలో…
పార్లమెంట్ సమావేశాల మాటున ఢిల్లీలో ఆ ఎంపీ సొంత కార్యాలు చక్కబెట్టుకుంటున్నారా? ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న అతను.. ఇప్పుడెందుకు పావులు కదుపుతున్నారు? మనసు మార్చుకున్నారా? మార్పు వెనక కథేంటి? ఎవరా ఎంపీ? ఈటల వ్యాపార భాగస్వామి కావడంతో భేటీకి ప్రాధాన్యం! ప్రధాని మోడీ మంత్రివర్గంలో ఇటీవల కేబినెట్ మినిస్టర్‌గా ప్రమోషన్ పొందిన కిషన్‌రెడ్డిని.. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి కలిసి మాట్లాడారు. ఒకే రాష్ట్రం నుంచి ఎంపీలుగా ఉన్నందున కలిశారులే అని కొట్టి పారేయడానికి ఈ భేటీ లేదన్నది…
హుజురాబాద్ ఉప ఎన్నికలపై ఫోకస్ పెట్టారు గులాబీ పార్టీ అధినేత, సీఎం కె. చంద్రశేఖర్ రావు.. దళిత బంధు పథకాన్ని పైలట్‌గా ఆ నియోజకవర్గం నుంచే ప్రారంభించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే కాదు.. ప్రతిపక్షాల విమర్శలకు సైతం తన దైన శైలిలో.. పథకాల ద్వారా లబ్ధిపొందాలని చూడమా? మాది రాజకీయా పార్టీ కాదా? అంటూ కౌంటర్ ఇచ్చారు కేసీఆర్.. ఇక. తాజాగా.. ఆ ప్రాంత ఎంపీటీసీకి ఫోన్ చేసి.. కేసీఆర్ నెరిపిన సంభాషణ ఇప్పుడు…
అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది… తమ గ్రామానికి రోడ్డు వేస్తామని హామీ ఇచ్చి.. ఇప్పటి వరకు రోడ్డు వేయలేదంటూ ఎమ్మెల్యేను అడ్డుకున్నారు గ్రామస్తులు.. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి ఎదురైన చేదు అనుభవానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే… ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని రత్నతండా గ్రామస్తులు అడ్డుకున్నారు.. దీంతో.. కాసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.. నర్మెట్ట మండలం మచ్చుపహడ్ రిజర్వు ఫారెస్ట్ లో అటవీ శాఖ ఆధ్వర్యంలో 10 వేల మొక్కలు నాటే…