టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎంకిపెళ్లి సుబ్బిచావుకు రావడం అంటే ఇదే. ఏదో ఆశించి ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తే.. అది అధికారపార్టీలోని మిగిలిన ఎమ్మెల్యేలను ఇరకాటంలో పడేసిందట. ‘రాజీనామా చేయండి సార్..!’ అంటూ.. సోషల్ మీడియాలో చేస్తున్న ట్రోలింగ్‌తో శాసనసభ్యులకు తలబొప్పి కడుతోందట. అదేంటో లెట్స్ వాచ్!
హుజురాబాద్‌లో దళితబంధు పైలెట్ ప్రాజెక్టు
Also Read
దళితుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ స్కీమ్‌పై వివిధ వర్గాలతో సమాలోచనలు చేశారు సీఎం కేసీఆర్. పథకాన్ని పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టబోతున్నట్టు ప్రకటించారు. ఆ నియోజకవర్గానికి చెందిన వారితో భేటీ నిర్వహించి.. పథకంపై వారికి అవగాహన కల్పించారు ముఖ్యమంత్రి. రోజంతా వారితో చర్చించి.. దళితబంధు అమలు విధానం.. లక్ష్యాలు.. ఫలితాలు ఎలా రాబట్టుకోవాలో వెల్లడించారట. ఒక్కో లబ్ధిదారుడికీ ఈ స్కీమ్ కింద 10 లక్షలు అందజేస్తారు.
రాజీనామా చేయాలంటూ ఎమ్మెల్యేలపై పోస్టింగ్‌లు
ఉపఎన్నిక వస్తే నిధులు వస్తాయని సెటైర్లు
ఇంత వరకు బాగానే ఉన్న.. అధికారపార్టీలోని ఎమ్మెల్యేలను ఈ స్కీమ్ టెన్షన్ పెట్టిస్తోందట.
హుజురాబాద్ ఉపఎన్నిక వల్లే నిధులు… స్కీమ్‌లు అంటూ రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతుండటంతో నియోజకవర్గాల్లోని స్వపక్షీయులు.. వైరిపక్షాలకు చెందిన వారు తమ ఎమ్మెల్యేలను సోషల్ మీడియాలో ఏకి పాడేస్తున్నారు. ఎమ్మెల్యే గారూ.. మీరు రాజీనామా చేయండి. ఉప ఎన్నిక వస్తుంది. నియోజకవర్గానికి కోట్ల రూపాయల నిధులు వస్తాయి. బై ఎలక్షన్‌లో మళ్లీ మీరే గెలిచేలా ఓట్లు వేస్తాం.. అంటూ సామాజిక మాధ్యమాల్లో శాసనసభ్యులను ట్యాగ్ చేస్తూ పోస్టింగ్‌లు పెడుతున్నారు. రాజీనామా చేయండి సార్ అని సెటైర్లూ వేస్తున్నారు. తెలంగాణలోని సోషల్ మీడియా వేదికలపై గత నాలుగైదు రోజులుగా ఇదే చర్చ.
ఎవరు మొదలుపెట్టారో కానీ.. రాష్ట్రమంతా ఒక్కటే చర్చ
టీఆర్‌ఎస్‌కే చెందిన వారు తమ ఎమ్మెల్యేలను ట్యాగ్ చేస్తూ పెడుతున్న పోస్టింగ్‌లు కాస్త గౌరవప్రదంగా ఉంటే.. విపక్ష పార్టీలకు చెందిన వారు పెడుతున్న పోస్ట్‌లు ఓ రేంజ్‌లో ఉంటున్నాయి. ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ఎవరు.. ఎక్కడ మొదలుపెట్టారో కానీ.. అధికారపార్టీ ఎమ్మెల్యేలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయట. ప్రస్తుతం హుజురాబాద్ ఉపఎన్నిక ఉండటంతో ఈ ప్రచారానికి ఎక్కడలేని ప్రాధాన్యం లభిస్తోంది. ఎవరిని కదిపినా ఇదే చర్చ. ఈ పోస్టింగ్‌లను కొందరు శాసనసభ్యులు లైట్ తీసుకుంటున్నారట. అరే.. మనపై కూడా జోకులు వేస్తున్నారుగా అని నవ్వు కుంటున్నారట. కానీ.. సీరియస్‌గా భావిస్తున్న వారు మాత్రం ఆందోళన చెందుతున్నట్టు పార్టీ వర్గాల టాక్.
- Tags
- off the record
- telangana
- TRS
తాజావార్తలు
-
Virat Kohli Records: 110 పరుగులు, 2 సెంచరీలు.. సచిన్ నాలుగు రేర్ రికార్డులపై ‘కింగ్’ కోహ్లీ కన్ను!
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Vaibhav Sooryavanshi: పోల్చుకోవడానికి ఏముంది?.. వైభవ్‌పై ఎలాంటి జెలసీ లేదు.. టీమిండియా స్టార్ సంచలన వ్యాఖ్యలు!
-
Dada : ‘దాదా’ మైసూర్ షెడ్యూల్ లో జాయిన్ కాబోతున్న NBK
-
KTR: గత పది, పదిహేను రోజులుగా ఒకాయనకు నిద్ర పట్టట్లేదు..
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?