టీఆర్ఎస్, ఎంఐఎం రెండూ ఒక్కటే నంటూ మరోసారి ఫైర్ అయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ఆయన చేపట్టిన పాదయాత్ర మూడు రోజుకు చేరుకుంది.. ఇక, రాత్రి బసచేసిన బాపుఘాట్ దగ్గర ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజ నుంచి మంచి స్పందన ఉందన్నారు.. మొన్న ప్రారంభమైన పాదయాత్ర నిన్న రాత్రి 2 గంటల వరకు కొనసాగిందన్న ఆయన.. యువతీ, యువకులు, మహిళలు, పెద్దవాళ్ళు పాదయాత్రకు బాగా మద్దతిస్తున్నారు.. మంగళ హారతులు…
టీఆర్ఎస్ మంత్రులు, నాయకులు కబ్జా కోరులుగా మారారు. కోట్ల రూపాయలవిలువ చేస్తే భూములను మింగేస్తుండ్రు అని దాసోజు శ్రావణ్ అన్నారు. మల్లారెడ్డిపై రేవంత్ ఆధారాలతో ఆరోపణలు చేశారు. మల్లారెడ్డి ఆరోపణలను ఎదుర్కోడానికి తొడలు, జబ్బలు కొట్టుకుంటూ మాట్లాడిండు. నేను అమాయకుసిని అని అంటుండు.. సిగ్గుచేటు అని తెలిపారు. సీఎం కేసీఆర్ ఎందుకు మౌనంగా వుంటున్నారు… మల్లారెడ్డితో ఏమైన కుమ్మక్కయ్యారా అని అన్నారు. అవినీతికి పాల్పడితే కొడుకునైన విడిచిపెట్టా అన్నారు. మరి మల్లారెడ్డిని ఎందుకు వదులుతున్నారు అని ప్రశ్నించారు.…
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో PRTU కృతజ్ఞత సభలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… ప్రభుత్వం ఏదైనా మంచి పని చేసినపుడు కృతజ్ఞతతో ఉండడం అనేది, ఒక మంచి దృక్పథం, పీఆర్సీ ని 30 శాతం ఇచ్చి సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయారు. కరోనా వల్ల కొంత ఆలస్యము జరిగింది తప్ప వేరే ఉద్దేశ్యం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్లకు ఒక్కసారి పీఆర్సీ 7 న్నర శాతంఇస్తే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం 5 ఏళ్ల…
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు లేఖరాశారు ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు.. వెలిగొండ ప్రాజెక్టు విషయంలో పునర్ సమీక్ష చేయాలని లేఖలో కోరారు.. వెలిగొండ ప్రాజెక్టుకు అనుమతులు లేవని తెలంగాణ ప్రభుత్వం ఎందుకు భావిస్తోందని లేఖలో ప్రశ్నించిన టీడీపీ ఎమ్మెల్యేలు.. కేంద్ర ప్రభుత్వానికి, కృష్ణా నది యాజమాన్య బోర్డుకు.. తెలంగాణ సర్కార్ రాసిన లేఖలు వెనక్కి తీసుకోవాలని కోరారు.. అయితే, గెజిట్‌లో వెలిగొండ ప్రాజెక్టు పేరు లేకపోవడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యమని మండిపడ్డ టీడీపీ ఎమ్మెల్యేలు.. 2014…
టిఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించనుందా? ఢిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణం తర్వాత ఆ దిశగా అడుగులు పడే ఛాన్స్ ఉందా ? అనువైన రాజకీయ పరిస్థితుల కోసం గులాబీ పార్టీ ఎదురు చూస్తోందా ? టిఆర్ఎస్ ఢిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి రెడీ అవుతోంది. సెప్టెంబర్ 2 న సీఎం కేసీఆర్ ఢిల్లీలో పార్టీ ఆఫీసు నిర్మాణానికి భూమి పూజ నిర్వహిస్తారు. పార్టీకి చెందిన ముఖ్యనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. టిఆర్ఎస్ ప్రస్థానంలో ఢిల్లీలో…
దళిత బంధు పథకానికి మద్దతుగా ఇవాళ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు దీక్ష చేపట్టనున్నారు. దళిత బంధు పథకం పై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ దీక్ష చేపట్టనున్నారు మోత్కుపల్లి నర్సింహులు. కాసేపట్లో అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించనున్న మోత్కుపల్లి నర్సింహులు.. 10 గంటల సమయంలో ఆయన నివాసంలో దీక్ష చేయనున్నారు. ఈ దీక్షను ఇవాళ సాయంత్రం 5 గంటలకు వరకు కొనసాగించనున్నారు. కాగా..ఇటీవలే తెలంగాణ సర్కార్ దళిత బంధు పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ…
దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహరావు కూతురు సురభి వాణీదేవి ఇవాళ ఎమ్మెల్సీ గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సురభి వాణీదేవి… పట్టభద్రుల ఎమ్మెల్సీ గా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం లోనే ఆమె ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శాసన మండలిలోని చాంబర్ లో ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి.. ఆమె తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఆమె గత మార్చి లో హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజక…
పంపకాల్లో తేడా వస్తే కోపాలొస్తాయి. ఒకరిపై ఒకరు ప్రతీకారం తీర్చుకోవడానికి రకరకాల పన్నాగాలు పన్నుతారు. ప్రస్తుతం ఆ జిల్లాలో ఇదే జరుగుతోందట. ప్రజాప్రతినిధులు, అధికారులు వైరివర్గాలుగా మారి ప్రతికార చర్యలకు దిగుతున్నారట. ఇప్పుడిదే రాజకీయాలను వేడెక్కిస్తోంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఎప్పుడు ఎవరు ఎలా రివెంజ్ తీర్చుకుంటారో? సంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్‌లో రాజకీయాలు ఒక్కసారిగా చర్చల్లోకి వచ్చాయి. జడ్పీ కేంద్రంగా సాగుతున్న గొడవలు ముదురుపాకాన పడి ఎప్పుడేం జరుగుతుందో తెలియడం లేదు. జడ్పీ మీటింగ్‌లో అధికారులపై ప్రజాప్రతినిధులు…
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై మండి పడ్డారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎందుకోసం పాదయాత్ర చేపడుతున్నాడు, ముందు తమ పార్టీ తెలంగాణ కు ఏమి ఇచ్చిందో చెప్పి పాద యాత్ర చేయాలని అన్నారు. సస్యశ్యామలం అయిన తెలంగాణలో అలజడులు సృష్టించేందుకు కొన్ని శక్తులు యాత్రల పేరుతో బయలుదేరాయని, వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.పెట్రోల్, గ్యాస్ ధరలను పెంచి ప్రజలను దోచుకొని తింటున్న బీజేపీ పార్టీ…