బీజేపీ చివరకు గాలిని కూడా అమ్ముతుందేమో..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో PRTU కృతజ్ఞత సభలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… ప్రభుత్వం ఏదైనా మంచి పని చేసినపుడు కృతజ్ఞతతో ఉండడం అనేది, ఒక మంచి దృక్పథం, పీఆర్సీ ని 30 శాతం ఇచ్చి సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయారు. కరోనా వల్ల కొంత ఆలస్యము జరిగింది తప్ప వేరే ఉద్దేశ్యం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్లకు ఒక్కసారి పీఆర్సీ 7 న్నర శాతంఇస్తే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం 5 ఏళ్ల కే 30 శాతం ఇచ్చింది. దేశం లొనే ఎక్కువ జీతాలు, పీఆర్సీ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే అని తెలిపారు.
గతం లో కరెంట్, మంచినీళ్లు గూర్చి శాసనసభ సమావేశం మొదటి రోజుల్లో నే నిరసన ఉండేది, ఇప్పుడు అలాంటి సమస్యలు ఉన్నాయా అని అడిగారు. మన పక్క రాష్ట్రానికి కరెంట్ అమ్ముతున్నాం. తెలంగాణ లో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచి నీటిని అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ. రోడ్ల వ్యవస్థ ను మెరుగు పర్చాము. వడ్లు అత్యధికంగా 3 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండించిన ఘనత తెలంగాణ దే.
Also Read
గతంలో తెలంగాణ వృద్ధి 5 శాతం నుండి 9 శాతం కు పోయాం. భారత దేశంలో మూడవ స్థానంలో ఉంది మన తెలంగాణ వృద్ధి. కొత్త జిల్లాలు, ఐటి పార్క్ లతో అభివృద్ధి సాధిస్తుంది. ఈటల రాజేందర్ దేని కోసం రాజీనామా చేశారు. వ్యక్తి కోసం ఉంటారా! వ్యవస్థ కోసం ఉంటారా అని ప్రశ్నించారు. హుజురాబాద్ ప్రజలు నిర్ణయం తీసుకోవాలి, రాజేందర్ గెలిస్తే, ఆయనకు, బీజేపీ కి లాభం. టీఆర్ఎస్ ను గెలిపిస్తే హుజురాబాద్ కు లాభం, ప్రజలు, మేధావులు గ్రహించాలి. తెలంగాణ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి, పేదలు, సంక్షేమం కోసం పని చేస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. కుట్టు మిషన్లు, కుంకుమ భరణి, బొట్టు బిల్లలు ఇవ్వడం ఈటల ఆత్మ గౌరవం అంటారా అన్నారు. అన్ని అమ్ముతున్న బీజేపీ చివరకు గాలి ని కూడా అమ్ముతుందేమో అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Abhijeet Dipke: నంబర్ ప్లేట్లు లేని కార్లు వెంబడిస్తున్నాయ్.. నన్ను ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు..
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!