దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహరావు కూతురు సురభి వాణీదేవి ఇవాళ ఎమ్మెల్సీ గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సురభి వాణీదేవి… పట్టభద్రుల ఎమ్మెల్సీ గా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం లోనే ఆమె ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శాసన మండలిలోని చాంబర్ లో ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి.. ఆమె తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఆమె గత మార్చి లో హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజక వర్గానికి జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి… అద్భుత విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రాం చందర్ రావు పై విజయం సాధించారు. ఇక ఈ ఎన్నికల్లో సురభి వాణీదేవి కు 1,89,339 ఓట్లు పోల్ కాగా.. బీజేపీ అభ్యర్థికి 1,37,566 ఓట్లు వచ్చాయి.