బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం సీటును గుంజుకుంటాం.. ఏనుగెక్కి ప్రగతి భవన్ కు వస్తామని ఆయన పేర్కొన్నారు. ఇవాళ ఆయన కామారెడ్డి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… టిఆర్ఎస్ నాయకుల బెదిరింపులకు భయపడమని… ఎన్నికల కోసమే దళితబంధు అని నిప్పులు చెరిగారు. నిజాంషుగర్ ను ప్రైవేటీకరణ చేసి వేలాది ఎకరాలు కబ్జా చేశారని ఆరోపించారు. ఇక్కడి రైతులకు కావాల్సిన పసుపు బోర్డు తేవడంలో ఎంపీ అరవింద్ విఫలమయ్యారని… రాబోయేది బహుజన రాజ్యమేనని స్పష్టం చేశారు.. ఓటు చైతన్యం కోసం బహుజన సమాజ్ పార్టీ ప్రయత్నిస్తోందన్నారు.