టీఆర్ఎస్ పార్టీపై ఈటల రాజేందర్ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. దమ్ముంటే కెసిఆర్ నా? హరీష్ నా ? ఎవరు నిలబడతారో చెప్పాలని ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. ”మీ పోలీసులని, అధికారులను, మంత్రులను, డబ్బులు ఆపు, కొనుగోళ్లు ఆపి ప్రచారం చెయ్యి నువ్వు గెలిస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటా. నువ్వు తప్పుకుంటావా? ఆ దమ్ముందా?” అంటూ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శక్తి పైసలతో రాదని.. ప్రజా బలంతో వస్తుందన్నారు. తాను సాయం చేసిన వారు..తనను కాపాడుకుంటారన్నారని తెలిపారు ఈటల. హుజురాబాద్ ఎడ్డిది కాదని… చైతన్యవంతమైన గడ్డ అని స్పష్టం చేశారు. కెసిఆర్.. ఇక నీ మోసం చెల్లదని… ఇండియా టుడే సర్వే కూడా తేల్చిందన్నారు. 84 శాతం ప్రజలు కేసీఆర్ ను నమ్మడం లేదు అని ఫైర్ అయ్యారు. తనను గెలిపించి… కెసిఆర్ అహంకారాన్ని అణచివేయాలని ప్రజలను కోరారు ఈటల.