టీఆర్‌ఎస్‌లో ఉనికి కోసం కడియం శ్రీహరి పోరాటం…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజకీయాల్లో ఉన్నప్పుడు మాటలు పొదుపుగా వాడాలి. అధికార పార్టీలో ఉన్నప్పుడు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆ స్టేట్‌మెంట్ ఆ మాజీ మంత్రి రాజకీయ జీవితాన్ని తలకిందులు చేసిందని టాక్. దీంతో పార్టీలో ఉనికి కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉందట. ఇంతకీ ఎవరా నేత? ఏమా కథా?
టీఆర్‌ఎస్‌లో ఉనికి కోసం పోరాటం?
Also Read
- Supreme Court: పిల్లలకు ఇంటర్నెట్ వినియోగం ప్రాథమిక హక్కు.. నిషేధానికి సుప్రీంకోర్టు నిరాకరణ!
- Maharashtra: మహా దారుణం.. వివాహితపై భర్త స్నేహితులు గ్యాంగ్‌రేప్
- Katie Zacharia: ట్రంప్‌తో పని చేయడం గౌరవంగా ఉంది.. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా తొలగింపుపై జకారియా కీలక పోస్ట్!
- Earthquake: పాకిస్థాన్‌లో భారీ భూకంపం.. భారత్‌లోనూ ప్రకంపనలు
కడియం శ్రీహరి. తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం. టీఆర్‌ఎస్ నాయకుడు. ప్రస్తుతం చేతిలో ఎలాంటి పదవి లేదు. మరోసారి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆ మధ్య సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటనలో గత ఆనవాయితీకి భిన్నంగా శ్రీహరి ఇంట్లో విందుకు వెళ్లారు. దాంతో టీఆర్‌ఎస్‌లో శ్రీహరికి ప్రాధాన్యం తగ్గలేదని.. పదవి ఖాయమని ప్రచారం జరిగింది. కానీ..రోజులు గడిచే కొద్దీ సీన్ రివర్స్. పార్టీలో ఉనికి కోసం పోరాడే పరిస్థితి నెలకొందట. దానిపైనే ఇప్పుడు గులాబీ శిబిరంలో చర్చ జరుగుతోంది.
శ్రీహరిపై శీతకన్ను వేశారా?
టీఆర్‌ఎస్‌లో ప్రస్తుతం హుజురాబాద్ ఉపఎన్నికపై ఫోకస్ నెలకొంది. సీనియర్ నేతగా ముద్రపడ్డ శ్రీహరికి అక్కడ ఉపఎన్నికలో బాధ్యతలు అప్పగించలేదు. మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, ఆరూరి రమేష్, సండ్ర వెంకట వీరయ్య, సుంకే రవి తదితరులకు ఎన్నికల బాధ్యతలు అప్పగించిన టీఆర్‌ఎస్.. శ్రీహరిపై శీతకన్ను వేసింది. హుజురాబాద్‌లో ఒక్క మండలానికి కూడా ఆయన్ని ఇంఛార్జ్‌గా వేయలేదు. దీంతో ఈ మాజీ డిప్యూటీ సీఎంను ఎందుకు పట్టించుకోలేదన్న చర్చ మొదలైంది.
దళితబంధుపై శ్రీహరి చేసిన కామెంట్స్ కొంప ముంచాయా?
హుజురాబాద్ వేదికగా దళితబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఆ సమయంలోనూ శ్రీహరిని పట్టించుకోలేదని సమాచారం. దళితబంధు పథకం ప్రారంభానికి కూడా ఆహ్వానించలేదట. వరంగల్ పర్యటనలో ఆనవాయితీకి బ్రేక్ ఇచ్చి శ్రీహరి ఇంటికి వెళ్లిన సీఎం కేసీఆర్.. ఎందుకు ఒక్కసారిగా ఆయన్ని పక్కన పెట్టారన్న చర్చ జరుగుతోంది. దీనిపై టీఆర్‌ఎస్ వర్గాల్లో రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. దళితబంధు పథకాన్ని సరిగా అమలు చేయకపోతే టీఆర్‌ఎస్‌కు నష్టం జరుగుతుందని ఆ మధ్య శ్రీహరి చేసిన కామెంట్స్ గులాబీ బాస్‌కు కోపం తెప్పించాయట. అందుకే శ్రీహరిని దూరం పెట్టారని సమాచారం.
అనుచరుల్లోనూ ఉత్సాహం తగ్గిందా?
టీఆర్‌ఎస్‌లో ఈటల ఎపిసోడ్ తర్వాత కడియం ప్రాధాన్యం తగ్గిందన్నది కొందరి అభిప్రాయం. దీంతో పార్టీలో ఉనికి కోసం ఈ మాజీ డిప్యూటీ సీఎం పోరాటం చేయాల్సిన పరిస్థితి నెలకొందట. అనుచరుల్లోనూ ఉత్సాహం తగ్గిందట. వారిలో జోష్ తీసుకొచ్చేందుకో ఏమో.. వరంగల్‌లో దళితబంధు పథకం సమీక్షకు తనకు ఆహ్వానం వచ్చిందని ఘనంగా ప్రకటించారట. ఆ స్టేట్‌మెంట్ తర్వాత శ్రీహరికి ఏమైంది అని ఆరా తీసేవాళ్లు ఎక్కువయ్యారు. మరి.. ఈ ప్రతికూల పరిస్థితులను ఆయన ఎలా అధిగమిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Sunday Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి నేడు పండగే, ఊహించని డబ్బు!
-
Gwalior Truck Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..అదుపు తప్పిన ట్రక్కు.. 12 మంది మృతి..
-
IND vs WI: వర్షం దెబ్బ.. ఇషాన్ కిషన్ విధ్వంసం వృథా! డ్రాగా ముగిసిన టీ20 సిరీస్..
-
Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రావెల్స్ బస్సులు ఢీ..
-
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!