హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పొరపాటున బీజేపీ గెలిస్తే పదేళ్ల అభివృద్ధి వెనక్కి పోతుందన్నారు మంత్రి హరీష్‌రావు.. కరీంనగర్ జిల్లా వీణవంకలో మంత్రి హరీష్ రావు సమక్షంలో పలువురు నేతలు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధి టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యం అన్నారు.. ఈ ప్రాంతంలో టీఆర్ఎస్ గెలిస్తే పది సంవత్సరాలు అభివృద్ధి ముందుకెళ్తుంది.. పొరపాటున బీజేపీ గెలిస్తే 10 సంవత్సరాలు అభివృద్ధి వెనక్కి వెళ్తుందన్నారు.. వ్యక్తి ప్రయోజనం ముఖ్యమా.. హుజురాబాద్…
తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ సవాళ్ల పర్వం మొదలైంది… ప్రభుత్వ పథకాలు, కేంద్ర ప్రభుత్వం నిధుల విషయంలో మంత్రి కేటీఆర్.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌కి సవాల్ విసిరారు.. నిరూపించలేకపోతే రాజీనామాకు సిద్ధమా? అని బహిరంగ సవాల్ విసిరారు.. అయితే, కేటీఆర్ సవాల్‌కు అదే రేంజ్‌లో కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్.. యూపీఏ ప్రభుత్వం కంటే ఎన్డీఏ ప్రభుత్వం 9 శాతం నిధులు అధికంగా రాష్ట్రానికి ఇచ్చిందన్న ఆయన.. కేటీఆర్ ఒక అజ్ఞాని, తుపాకీ రాముడు అని…
చరిత్రను కనుమరుగు చేస్తున్నారంటూ మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. తన పాదయాత్రలో భాగంగా రాందాస్ చౌరస్తాలో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యమంలో సెప్టెంబర్ 17ను నిర్వహించాలని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు ఎందుకు చేయడం లేదు? అని ప్రశ్నించిన ఆయన.. నిజాం కుటుంబానికి భయపడి కేసీఆర్ విమోచన దినోత్సవం జరపడం లేదని ఆరోపించారు.. ఇక, ఈ నెల 17వ తేదీన నిర్మల్‌లో జరగనున్న కేంద్ర హోంశాఖ…
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలకేంద్రంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ… గీత కార్మికుల కోసం ఎన్ని అభ్యంతరాలు వచ్చినా.. హైదరాబాద్ లో కల్లుడిపోలు తెరిపించారు కేసీఆర్. హైదరాబాద్ లో కల్లు డిపోలు తెరవడం వల్ల లక్ష మందికి ఉపాధి దొరుకుతోంది. కల్లుడిపోల మీద ఒక్క కేసు కూడా పెట్టడంలేదు. ఎక్సైజ్ మామూళ్లు లేకుండా, అధికారుల వేధింపులు లేకుండా చేసి గీతకార్మికులను ఆదుకున్నాం. గతంలో 2 ఏళ్లకోసారి కల్లుడిపోల లైసెన్సుల పునరుద్ధరణ…
కేంద్ర ప్రభుత్వం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న పాదయాత్రపై మండిపడ్డారు తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్.. తెలంగాణకు బీజేపీ తీవ్ర అన్యాయం చేస్తోందని విమర్శించిన ఆయన.. గతంలో కాంగ్రెస్ కాజీపేటకు రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీని పంజాబ్‌కు తరలిస్తే.. ఇప్పుడు బీజేపీ లాతూర్ కు తరలించిందన్నారు.. ఇక, బండి సంజయ్ తన పాదయాత్రను ఢిల్లీ వైపు మార్చి.. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టుల గురించి పోరాడాలని సూచించారు. సంజయ్ చేస్తున్నది ప్రజా సంగ్రామ యాత్ర…
కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని విమర్శించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి… గాంధీ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గుజ్జుల మహేష్‌కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పీసీసీ చీఫ్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలకు అన్యాయమే జరుగుతుంది.. ఏదో చేస్తాడని రెండు సార్లు కేసీఆర్‌ను సీఎంను చేస్తే.. ఏమీ చేయకుండా కుటుంబ పాలన చేస్తున్నారంటూ మండిపడ్డారు.. కుటుంబ సభ్యులకు వందల ఎకరాల భూములు కట్టబెట్టారు.. ఆంధ్ర కాంట్రాక్టర్లకు…
పార్టీ నిర్మాణం, గ్రామ, వార్డు స్థాయి నుంచి కొత్త కమిటీల ఏర్పాటుపై ఫోకస్ పెట్టింది టీఆర్ఎస్ పార్టీ.. ఇప్పటికే పలు సందర్భాల్లో పార్టీ కమిటీల విషయంలో టీఆర్ఎస్ శ్రేణులకు ఆదేశాలు ఇచ్చిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీలతో సమావేశం నిర్వహించారు.. పార్టీ సంస్థాగత కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. జనరల్ సెక్రటరీలు ఇంఛార్జ్‌లుగా ఉన్న నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యక్రమాల వివరాలు అడిగి తెలుసుకున్నారు.. గత రెండు వారాలుగా జరుగుతున్న కమిటీల…
జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆబాది జమ్మికుంట గుండ్ల చెరువులో చేప పిల్లలు వేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అనంతరం ఆయన మాట్లాడుతూ… నేను రాజీనామా చేసినందుకు చేప పిల్లలు వస్తున్నాయని ఈటల చెబుతుండు. చేప పిల్లల పంపిణి కార్యక్రమం ప్రభుత్వం ఏమైన కొత్తగా చేపట్టిందా… స్వయం పాలన రావడం ఎంత ముఖ్యమో మనకు ఇప్పుడు అర్ధం అవుతుంది. తెలంగాణలో కుల వృత్తుల మీద ఆధార పడి జీవన ప్రమాణాలు ఉంటాయి. కుల వృత్తులను అన్ని విధాలుగా…
జ్యోతిరాదిత్య సిందియా ప్రగతి భవన్ కు వెళ్లడంతో తెలంగాణ బిజెపి నేతలు ఇరకాటంలో పడ్డారా ఇప్పటికే కేసీఆర్ డిల్లీ టూర్ ఓ పక్క, హుజూరా బాద్ ఎన్నికల షెడ్యూల్ రాక పోవడం మరోపక్క తెలంగాణ బిజెపి నేతల్ని ఇబ్బందుల్లో పడేశాయి. ఇప్పుడు కేంద్రమంత్రులు కూడా ప్రగతిభవన్ కి వెళ్లి కెసీఆర్ ని కలుస్తున్నారు.. తెలంగాణలో టియ్యారెస్ కు తామే ప్రత్యామ్నాయం అంటున్న బీజేపీ రాష్ట్ర నేతలు ఈ పరిణామాలతో టెన్షన్ పడుతున్నారట. ఓ వైపు తెలంగాణ బీజేపీ…
సీఎం కేసీఆర్ పాలనలో సంక్షేమ యుగం నడుస్తోంది. చెప్పింది చెప్పినట్లు చేసుడే తప్ప.. మాట తప్పడం మాకు తెల్వదు అని మంత్రి హరీశ్ రావు అన్నారు. రేపురా.. మాపురా అనే ఉద్దెర బేరాలు మా దగ్గర ఉండవు. బీజేపీ పాలనలో పెట్రోలు, డిజీల్, గ్యాస్ ధరలు పెరిగాయి. గ్యాస్ సబ్సిడీ తగ్గించారు. అయినప్పటికీ పువ్వు గుర్తుకే ఓటు వేస్తే.. సిలిండర్ ధర 1500 అవుతుంది అని తెలిపారు. బొట్టుబిల్లలు, గోడగడియారాలు ఇస్తామన్న మాటలు ఆపేసి.. సిలిండర్ ధర,…