టీఆర్ఎస్ గెలిస్తే పదేళ్లు ముందుకు.. బీజేపీ గెలిస్తే పదేళ్లు వెనక్కి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పొరపాటున బీజేపీ గెలిస్తే పదేళ్ల అభివృద్ధి వెనక్కి పోతుందన్నారు మంత్రి హరీష్‌రావు.. కరీంనగర్ జిల్లా వీణవంకలో మంత్రి హరీష్ రావు సమక్షంలో పలువురు నేతలు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధి టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యం అన్నారు.. ఈ ప్రాంతంలో టీఆర్ఎస్ గెలిస్తే పది సంవత్సరాలు అభివృద్ధి ముందుకెళ్తుంది.. పొరపాటున బీజేపీ గెలిస్తే 10 సంవత్సరాలు అభివృద్ధి వెనక్కి వెళ్తుందన్నారు.. వ్యక్తి ప్రయోజనం ముఖ్యమా.. హుజురాబాద్ ప్రజల ప్రయోజనం ముఖ్యమా? ఒక వ్యక్తికి లాభం జరగాలా..? రెండున్నర లక్షల మంది హుజురాబాద్ ప్రజలకు లాభం జరగాలా..? అనేది మీ ముందు ఉన్న ప్రశ్న అన్నారు..
మరో రెండున్నరేళ్లు టీఆర్ఎస్ అధికారంలో ఉంటుంది.. గెల్లు శ్రీనివాస్ వెనుక ప్రభుత్వం ఉండి అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తుందన్నారు హరీష్‌రావు.. 2004లో ఈటల రాజేందర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ముద్దసాని దామోదర్ రెడ్డి మీద నిలబడ్డప్పుడు ఉద్యమకారుడేగానీ సర్పంచ్, ఎంపీటీసీ, కౌన్సిలర్ కాదని గుర్తుచేశారు.. ఇక, గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు 21 ఏళ్ల ఉద్యమ అనుభవం ఉందని.. టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం కూడా ఉందని.. గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపులో హుజురాబాద్ అభివృద్ధి దాగి ఉందన్నారు హరీష్‌రావు… ఈటల రాజేందర్ మళ్లీ గెలిస్తే ప్రతిపక్ష ఎమ్మెల్యే అవుతాడు.. బీజేపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు.. ఈటల మూడో ఎమ్మెల్యే అవుతాడు.. కానీ, మంత్రి కాదు కదా..? అని వ్యాఖ్యానించారు. హుజురాబాద్ ప్రజలు ఎందుకు నష్ట పోవాలి..? అని ప్రశ్నించిన ఆయన.. టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు మేలు చేసింది తప్ప ఎప్పుడూ నష్టం చేయలేదన్నారు.. బీజేపీ అన్ని ధరలు పెంచింది.. విమానాలు, రోడ్లు, రైళ్లను కుదువబెట్టి.. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతోందని మండిపడ్డారు హరీష్‌రావు.. ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టిన బీజేపీకి ఓటేద్దామా.. లక్షా 30 వేల ఉద్యోగాలు ఇచ్చి.. మరో 50 వేల ఉద్యోగాలు ఇస్తామన్న టీఆర్ఎస్ కు ఓటేద్దామా ఆలోచించాలని సూచించారు.
Also Read
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
- Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!