సంజయ్‌ది తెలంగాణ వంచన యాత్ర.. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న పాదయాత్రపై మండిపడ్డారు తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్.. తెలంగాణకు బీజేపీ తీవ్ర అన్యాయం చేస్తోందని విమర్శించిన ఆయన.. గతంలో కాంగ్రెస్ కాజీపేటకు రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీని పంజాబ్‌కు తరలిస్తే.. ఇప్పుడు బీజేపీ లాతూర్ కు తరలించిందన్నారు.. ఇక, బండి సంజయ్ తన పాదయాత్రను ఢిల్లీ వైపు మార్చి.. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టుల గురించి పోరాడాలని సూచించారు. సంజయ్ చేస్తున్నది ప్రజా సంగ్రామ యాత్ర కాదు.. తెలంగాణ వంచన యాత్ర అంటూ కామెంట్ చేసిన వినయ్ భాస్కర్.. వరంగల్‌లో సంజయ్ పాద యాత్రకు ముందే కోచ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడాలని.. లేదంటే ప్రజలు సంజయ్‌ని ప్రతిఘటిస్తారని హెచ్చరించారు. బీజేపీకి తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు లేదన్న ప్రభుత్వ చీఫ్ విప్.. బీజేపీకి ఇక తెలంగాణలో పుట్ట గతులుండవన్నారు.
Also Read
తాజావార్తలు
-
Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!