భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడారు. అంబేడ్కర్‌తోనే దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాలకు అవకాశాలు లభిస్తున్నాయన్నారు. అంబేద్కర్ ముందు చూపుతోనే మన దేశంలో రిజర్వేషన్లు అమలు అవుతున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ రిజర్వేషన్లను ఉపయోగించుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆమె పేర్కొన్నారు. కాగా అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం వలనే వెనుకబడిన వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. వెనుబడిన వర్గాల ప్రజలకు ఇంకా రాజ్యాంగ…
రాజన్న సిరిసిల్లా జిల్లాలో మాజీ మేయర్, కరీంనగర్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్ ఆదివారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ పార్టీపై మంత్రి కేటీఆర్ పై విమర్శల దాడులకు దిగారు. సిరిసిల్ల మునిగిపోతుంటే మంత్రిగా కేటీఆర్ ఏం చేస్తున్నారు. మీరు కేవలం ఐటీమంత్రిగానే పనిచేస్తారు… మీరు మున్సిపల్ మంత్రిగా పనికిరారు. 500 సెక్షన్లు ఉన్న మున్సిపల్ చట్టాన్ని 200 సెక్షన్లుగా మార్చి.. కౌన్సిలర్లను, కార్పోరేటర్లను ఉత్సవ విగ్రహాలుగా మార్చిన ఘనత…
ధాన్యం కొనుగోలుపై తెలంగాణలో బీజేపీ, టీఆర్‌ఎస్ నేతలు ఒకరిపైఒకరి విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పచ్చి అవాస్తవాలు చెబుతున్నారని, ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్రం కేంద్రానికి కేవలం సహకారం మాత్రమే అందిస్తుందని అన్నారు. ధాన్యం కొనుగోళ్లు, మిల్లింగ్, ఎగుమతి అంతా ఎఫ్‌సీఐ బాధ్యతేనని, తెలంగాణ నుండి బియ్యం తరలించాలని పలుమార్లు కలెక్టర్లు, సివిల్ సప్లైస్…
తెలంగాణలో వరి ధాన్యం పై గత కొన్ని రోజులుగా చర్చ నడుస్తునే ఉంది. కేంద్రం, రాష్ర్టం ఒకరి పై ఒకరు ఆరోపణలు చేసుకుంటునే ఉన్నాయి. మొన్న ఈ మధ్య ఇదే విషయన్ని చర్చించడానికి తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తన బృందంలో ఢీల్లీ వెళ్లిన ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికే రైతులు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. అటు బీజేపీ నాయకుల మాటలు వినాలా..ఇటు ప్రభుత్వ మాటలు వినాలా అనే సందిగ్ధంలో ఉన్నారు. తాజాగా మరోసారి…
ఉద్యమకారులు అందరూ కేసీఆర్ నీ వదిలి బయటికి రావాలని ఉద్యమకారులకు ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన మాజీమంత్రి ఈటెల రాజేందర్ కు బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ముత్యాలమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేసిన ఈటల రాజేందర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 19 మంది ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరుగుతుంటే ఒకే ఒక్కటి ఎస్సీ లకు ఇచ్చారని,ఎస్టీలకు ఒక్కరికీ ఇవ్వలేదని అన్నారు.మైనార్టీలకు ఉన్న ఒక్కటి లాక్కొని వారి కళ్లలో మట్టి కొట్టారని…
వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు రైతుల జీవితాలతో ఆటలాడుతున్నాయని సీపీఎం మాజీ ఎమ్మెల్యే, రాష్ర్ట కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటిరంగారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం మహబూబ్‌నగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్ల నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుకోవాలని చూస్తే రైతులు చూస్తూ ఊరు కోరని వారి పక్షాన సీపీఎం పోరాటం చేస్తుందని ఆయన తెలిపారు. ఇప్పటికే కళ్లాల వద్ద ధాన్యం వానలకు తడిసి, ఎండలకు ఎండుతుందని మార్కెట్లలో మౌలిక…
హుజురాబాద్ ఉప ఎన్నిక మినీ రాజకీయ యుద్ధాన్ని తలపించింది. అధికార టీఆర్‌ఎస్ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరి పోటీ కొనసాగింది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ను ఎదుర్కొనేందుకు టీఆర్‌ఎస్ చేయని ప్రయత్నం లేదు. ఒకరి మీద కరు విమర్శలు ప్రతి విమర్శలతో మాటల దాడికి దిగారు ఆయా పార్టీల నేతలు. అధికార పార్టీ దొంగల పార్టీ అని బీజేపీ వాళ్లు అంటే .. టీఆర్‌ఎస్ పార్టీనే దొంగల పార్టీ అని బీజేపీ నాయకులు ఒకరి పై…
జనగామ మండలం పెంబర్తి గ్రామంలోని శివమ్ గార్డెన్ లో జరుగుతున్న BJP జనగామ జిల్లా రాజకీయ శిక్షణ తరగతులకు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈటల రాజేందర్ హుజారాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపొందిన తరువాత మొదటిసారి జిల్లాకు రావడంతో బీజేపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం మీడియా సమావేశంలో ఈటల మాట్లాడుతూ ..కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన అప్రజాస్వామిక పాలన కొనసాగుతుందన్నారు. దీనిని నియంత్రించే శక్తి ఒక్క…
రంగారెడ్డి జిల్లా బీజేపీ శిక్షణ తరగతుల్లో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పై విమర్శల వర్షం కురిపించారు. గొప్ప రాజ్యాంగం ఉన్న ఈ దేశంలో.. హుజూరాబాద్‌లో కేసిఆర్ నియంతృత్వంతో స్వేచ్ఛను హరించారన్నారు. స్వేచ్ఛ మీద ఉక్కుపాదం పెట్టారు. అందుకే అక్కడ ప్రజలు బయటికి మాట్లాడకుండా ఉండి అవకాశం వచ్చినపుడు ఓటుతో తమ శక్తిని చూపించారని ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్ కోరలు పీకారు. చెంప చెళ్లుమనిపించి…