తెలంగాణలో వరి ధాన్యం పై గత కొన్ని రోజులుగా చర్చ నడుస్తునే ఉంది. కేంద్రం, రాష్ర్టం ఒకరి పై ఒకరు ఆరోపణలు చేసుకుంటునే ఉన్నాయి. మొన్న ఈ మధ్య ఇదే విషయన్ని చర్చించడానికి తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తన బృందంలో ఢీల్లీ వెళ్లిన ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికే రైతులు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. అటు బీజేపీ నాయకుల మాటలు వినాలా..ఇటు ప్రభుత్వ మాటలు వినాలా అనే సందిగ్ధంలో ఉన్నారు. తాజాగా మరోసారి తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. యాసంగిలో రైతులు వరి కాకుండా ఇతర పంటలు వేయలని మంత్రి మరోసారి స్పష్టం చేశారు.
ధాన్యాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేని అని, కానీ ఆ బాధ్యతను మరిచి రాష్ర్ట ప్రభుత్వం పై నెపం వేస్తుందని విమర్శించారు. రైతుల ప్రయోజనాలను మోడీ సర్కారు పట్టించుకోకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తుందని ఇది సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు. కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్ చెప్పినవన్నీ అబద్ధాలేనని, ఆయన దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన అన్నారు. బీజేపీ నాయకులకు దమ్ము ఉంటే రాష్ర్టంలో పండించే పంటను కొనేలా కేంద్రంతో ఒప్పించాలని మంత్రి నిరంజన్ రెడ్డి సవాల్ విసిరారు.