వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో గందరగోళ పరిస్థితులతో రైతు కన్నీరు పెడుతున్నాడు.. ధాన్యం మార్కెట్‌కు తరలించినా ఎప్పుడు కొంటారో తెలియని పరిస్థితి.. మరోవైపు వర్షాలతో కల్లాలు, రోడ్లపైనే ధాన్యం తడిసిసోయి రైతులను కన్నీరు పెట్టిస్తుంది.. అయితే, వరి ఉరి కాదు.. రైతుల పాలిట సిరి అంటున్నారు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్ఎస్ ప్రభాకర్.. వరి విషయంలో తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని విమర్శించిన ఆయన.. వానాకాలం పంటను ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని.. రైతుల ఆత్మహత్యలకు…
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయిన రోజు నుంచి… ఇవాళ్టి వరకు సమావేశాలు చాలా వేడి వాడిగా సాగుతున్నాయి. ముఖ్యంగా రైతుల సమస్యలే ఫోకస్ గా విపక్షాలు ప్లారమెంట్ లో నిరసనలు తెలుపుతున్నాయి. ఇక ఇవాళ్టి రోజు కూడా టీఆర్‌ఎస్ పార్టీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్ వేదికగా… నిలదీశారు. ప్రొక్యూర్మెంట్ పాలసీని ప్రకటించాలని డిమాండ్ చేశారు ఎంపీలు. ఈ నేపథ్యంలో.. ఇవాళ లోక్ సభలో టీఆర్‌ఎస్ ఎంపీలు.. స్పీకర్ పొడియాన్ని చుట్టుముట్టారు. ప్లకార్డులు పట్టుకుని.. కేంద్రానికి వ్యతిరేకంగా..…
రెబల్ అభ్యర్థి బరిలో ఉండటంతో టీఆర్ఎస్‌కు ఇబ్బందిగా మారిందా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరి దృష్టి ఆ జిల్లాపైనే ఉందా? కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు పోటీలో లేకపోయినా.. గులాబీ శిబిరంలో గుబులెందుకు? లెట్స్ వాచ్..! రెబల్ అభ్యర్థిగా రవీందర్‌సింగ్..! తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరుచోట్ల అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైతే.. మరో ఆరుచోట్ల పోటీ నెలకొంది. ఓటర్లను క్యాంపులకు తరలిస్తున్నారు. హైదరాబాద్‌తోపాటు పక్క రాష్ట్రాల్లోను ఈ శిబిరాలు నడుస్తున్నాయి. ఈ హీట్‌లో ప్రస్తుతం అందరి దృష్టీ ఉమ్మడి…
తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ లుగా ఎన్నికైన ఆరుగురు సభ్యులు ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ శాసనమండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి… ఒకరి తర్వాత ఒకరిని తన ఛాంబర్ లో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి టీఆర్‌ఎస్ పార్టీ కి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు గా గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీ హరి, బండా ప్రకాశ్, వెంకట్రామిరెడ్డి, తక్కళ్ల పల్లి…
ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణలో ఇంకా స్పష్టత రాలేదు. ఓ వైపు అధికారి టీఆర్‌ఎస్ పార్టీ అధినేత ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర స్పష్టత ఇవ్వలేదంటూ కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. మరో వైపు తెలంగాణ బీజేపీ నేతలు వానాకాలంలో పండించిన ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అంటున్నారు. ఇదిలా ఉంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులును మోసం చేస్తున్నాయని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇప్పటికే కర్షకుల కోసం కాంగ్రెస్ అంటూ రైతులకు న్యాయం చేయాలని…
ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పటికే టీఆర్‌ఎస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు చేయలేక డ్రామాలు ఆడుతోందని బీజేపీ నేతలు అంటుంటే.. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వలేదని టీఆర్‌ఎస్ నేతలు అంటున్నారు. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ నేతలు సైతం ధాన్యం కొనుగోళ్లు చేసిన రైతులకు న్యాయం చేయాలంటూ వరి దీక్షలకు కూడా దిగారు. తాజాగా మాజీ పీసీసీ ఉత్తమ్‌కుమార్ మాట్లాడుతూ.. ధాన్యం సేకరణలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.…
రైతుల సంక్షేమం విషయంలో దేశానికే మార్గదర్శి తెలంగాణ సీఎం కేసీఆర్ అంటూ ప్రశంసలు కురిపించారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి… నల్గొండలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ధాన్యం కొనుగోళ్లలో రైతుల ఇబ్బందులకు ప్రధాన కారణం బీజేపీయే అంటూ మండిపడ్డారు… రబీ ధాన్యం ఇంకా 50 శాతం ఎఫ్ సీఐ గోదాముల్లో ఉంది, కేంద్ర ప్రభుత్వం రైల్వే వ్యాగన్లు ఏర్పాటు చేసి ఆ ధాన్యాన్ని వెంటనే తరలించాలని డిమాండ్ చేశారు… ఇక, ధాన్యం సేకరణ పై…
వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర వర్సెస్ తెలంగాణ ప్రభుత్వంగా మారిపోయింది పరిస్థితి.. యాసంగిలో వరి కొనే పరిస్థితి లేదని కేంద్రం తేల్చేయడంతో.. ప్రత్యామ్నాయ పంటలపై ఫోకస్ పెట్టాలని రైతులకు సూచిస్తోంది తెలంగాణ సర్కార్.. మరోవైపు.. ప్రతీ గింజా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు.. కేంద్రం కొనదు కానీ, రాష్ట్ర నేతలు ఇలా మాట్లాడడం ఏంటి? అంటూ టీఆర్ఎస్ మండిపడుతోంది.. ఈ తరుణంలో.. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే చేసిన…
గడిచిన రెండేళ్లలో రాష్ర్టంలోని ప్రజాప్రతినిధులను పట్టించుకోలేదని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ర్టంలో ప్రజాప్రతినిధులను పట్టించుకోలేదు. నిధులు ఇవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్‌ఎమ్మెల్సీ అభ్యర్థులను పెట్టినందుకు వారిని గౌరవిస్తున్నారన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు లేవని ఆయన స్పష్టం చేశారు. జిల్లా నాయకులు, దామోదర్, గీత రెడ్డితో మాట్లాడి ఎమ్మెల్సీ అభ్యర్థిని…
ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకులు, కేంద్ర మంత్రులపై విచక్షణ కోల్పోయి బూతులు మాట్లాడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం, భాజపా నాయకులు చేసిన తప్పేంటో కేసీఆర్ ప్రజలకు విడమర్చి చెప్పాలన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కేసీఆర్ దూషించిన భాష సభ్య సమాజం తల దించుకునేలా ఉందని, మేధావులు కేసీఆర్ భాషపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. బూతులు మాట్లాడిన కేసీఆర్ ముఖ్యమంత్రి కుర్చీలో ఉండటం…