ఈటల రాజేందర్ భూముల వ్యవహరం పై కలెక్టర్ నిన్న నివేదిక ఇచ్చిన సంగతి తెల్సిందే కాగా ఈ నివేదిక పై ఈటల రాజేందర్ భార్య జమున అసహనం వ్యక్తం చేసింది. కలెక్టర్‌ను కూడా టీఆర్‌ఎస్ కండువా కప్పుకోవాలంటూ విమర్శించారు. అయితే తాజాగా ఈ వ్యవహారం పై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మీడియా సమావేశంలో ఈటల రాజేందర్ పై తీవ్ర విమర్శలు చేస్తూ మాటల దాడికిదిగారు. బీజేపీ, ఈటలపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ఈటల తప్పు…
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేపల పంపిణీ కార్యక్రమంలో అవకతవకలు వస్తున్నాయన్న విమర్శలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. ప్రభుత్వం మత్స్యకారులకు నాణ్యమైన చేప పిల్లలు, రొయ్య పిల్లలను పంపిణీ చేస్తుందని మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ పథకం తీసుకొచ్చిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి రొయ్యల పంపిణీలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నల్గొండ జిల్లా కొండ భీమనపల్లి చెరువులో విడుదల…
పార్లమెంట్ శీతాకాల సమావేశాల సమయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు టీఆర్ఎస్ ఎంపీలు.. పార్లమెంట్ సమావేశాలు బహిష్కరించాలనే నిర్ణయానికి వచ్చారు.. ఈ రోజు కూడా దాన్యం సేకరణ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఉభయ సభల్లో ఆందోళన చేపట్టనున్నారు టీఆర్ఎస్ ఎంపీలు.. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి వరుసగా లోక్‌సభ, రాజ్యసభలో రైతుల సమస్యలు, ధాన్యం కొనుగోళ్లపై ఆందోళన చేస్తున్న ఎంపీలు.. ఇవాళ సమావేశాలను బహిష్కరించనున్నారు.. Read Also: ఇక అలా కుదరదు..! వర్క్ ఫ్రమ్ హోంపై…
హైదరాబాద్‌లోని రీజినల్ లేబర్ కమిషనర్ సమక్షంలో యాజమాన్యంతో సింగరేణి జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణతో పాటు… కార్మికుల ప్రధాన డిమాండ్లపై ఆర్‌ఎల్‌సీ, సింగరేణి అధికారులతో జేఏసీ నేతలు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాకులు సింగరేణికే ఇవ్వాలని, ఇతర 12 డిమాండ్ల పై చర్చించడానికి చొరవ చూపాలని సూచించారు. అయితే ఈ చర్చలు విఫలం కావడంతో సమ్మె చేసి తీరుతామని…
యాసంగిలో వరి ధాన్యం సేకరణపై స్పష్టతను ఇవ్వాలని లోక్‌సభలో ఆందోళన చేపట్టిన టీఆర్ఎస్ ఎంపీలు ఈ రోజు సమావేశాల్లో కేంద్రం తీరును నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. జాతీయ ధాన్యం సేకరణ విధానం, మద్దతు ధరకు చట్టబద్ధతను కల్పించాలని డిమాండ్ చేశారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం అయిన వెంటనే కేంద్రం వైఖరిని నిరసిస్తూ టీఆర్‌ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. ఈ అంశంపై చర్చించాలంటూ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. టీఆర్‌ఎస్ ఎంపీల…
అంబేద్కర్ వర్థంతిని పురస్కరించుకొని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితబంధుపై కీలక వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నిక కోసమే దళితులను కేసీఆర్ మభ్యపెట్టారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ఎన్నికల తరువాత దళిత బంధు ఎందుకు అమలు చేయటంలేదో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. దళితులకు మేలు చేసే ఉద్దేశం ఉంటే తక్షణమే దళిత బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. జీహెచ్‌ఎంసీ…
భారతీయ జనతా పార్టీ వర్గాలలో ఫ్రెండ్లీ పార్టీగా పేరున్న తెలంగాణ రాష్ట్ర సమితి చివరకు ప్రతిపక్షాల గూటికి చేరింది. తెలంగాణలో పెరుగుతున్న బీజేపీ బలానికి నిదర్శనంగా విశ్లేషకులు ఈ పరిణామాలను చూస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పట్ల టీఆర్‌ఎస్ ఇప్పటి వరకు తటస్థ వైఖరిని అనుసరించింది. చాలా సందర్భాలలో కేంద్ర ప్రభుత్వ విధానాలను సమర్ధించింది. బిల్లలుకు మద్దతిచ్చింది. లేదంటే వ్యూహాత్మక మౌనాన్ని ఆశ్రయించిందే తప్ప ఏనాడూ వ్యతిరేకత ప్రదర్శించలేదు. మోడీ సర్కార్‌ని విమర్శించటం చాలా అరుదు.…
ఉద్యోగులకు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.. కొత్త జోనల్ విధానం వచ్చినప్పట్టి నుంచి బదిలీల కోసం ఎదురు చూస్తున్నారు ఉద్యోగులు.. ఇక, రేపో మాతో ఆ ప్రక్రియ ప్రారంభం అవుతుందని.. సొంత జిల్లాలోనే ఉద్యోగం చేసుకోవచ్చు అని నీరక్షిస్తున్నారు.. అయితే, వారికి గుడ్‌న్యూస్ చెబుతూ ఉద్యోగులను సొంత జిల్లాలకు బదలాయించే విధివిధానాలను ఖరారు చేసింది ప్రభుత్వం.. దీనిపై ఇవాళ ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది.. స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన చేపట్టనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది తెలంగాణ సర్కార్..…
సీఎం కేసీఆర్ పై మరోమారు వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. బంగారు తెలంగాణను… సీఎం కేసీఆర్ చావుల తెలంగాణ చేసాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, ఆర్టీసీ కార్మికుల చావులు కేసీఆర్ పాలన మనకు కనిపించాయని.. ఇప్పుడు సర్పంచ్ ల కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఓ రేంజ్ లో రెచ్చి పోయారు షర్మిల. చేసిన పనులకు బిల్లులు రాక, చేసిన అప్పులు తీర్చలేక చావే శరణ్యం అని రాష్ట్రంలోని సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన…
రైతు సమస్యలపై పార్లమెంట్ లోపల, బయట ఆందోళన చేస్తూ వస్తోంది టీఆర్ఎస్ పార్టీ… ముఖ్యంగా తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వైరం కొనసాగుతూనే ఉంది.. ఇక, తెలంగాణ రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ఉభయసభల నుంచి ఇవాళ వాకౌట్ చేశారు టీఆర్ఎస్ ఎంపీలు.. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఇవాళ ఆరో రోజు కూడా ఉభయ సభల్లో ఆందోళన కొనసాగించారు టీఆర్ఎస్ ఎంపీలు.. లోకసభలో స్పీకర్ పోడియాన్ని…