ఖమ్మం ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థిగా తాతా మధుకు సంబంధించిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు అందరినీ గోవా క్యాంప్ కు తరలించారు. గత వారం రోజులుగా 470 మంది ఓటర్లు వారితోపాటు వారి బంధువులు అంతా గోవాలో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. గోవాలో డ్యాన్సులతో మారుమోగుతున్న వీడియోలను ఎప్పటికప్పుడు ఎన్టీవీ అందించింది. అయితే ఈ నెల పదో తారీఖున ఓటింగ్ ఉండటంతో అక్కడ ఉన్న ఓటర్లను ముందుగా హైదరాబాద్ కి తరలిస్తున్నారు. ప్రస్తుతతం గోవాలో ఉన్న ఓటర్లు…
తెలంగాణలో సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మంగళవారం నిజమాబాద్ జిల్లాలోని భీంగల్ పట్టణంలో టీఆర్‌ఎస్ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న కవిత మాట్లాడుతూ.. భీంగల్ పట్టణానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో అమలు చేసుకునేందుకు కృషి చేస్తామని ఆమె అన్నారు. అభివృద్ధి విషయంలో దేశంలో మంచి పేరు తెలంగాణ తెచ్చుకుందని, ఇవన్నీ పక్కన పెట్టి కొందరు బీజేపీ నాయకులు రాజకీయం మాట్లాడుతున్నారని…
తెలంగాణలో కాంగ్రెస్ సభ్యత్వ నమోదు గురించి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ మాట్లాడుతూ… తెలంగాణ పై సోనియా గాంధీ ప్రకటన చేసిన రోజు డిసెంబర్ 9… అందుకే డిసెంబర్ 9 ఉదయం 10 గంటల నుండి సభ్యత్వ నమోదు ప్రారంభిస్తున్నాము అని తెలిపారు. ఈసారి డిజిటల్ సభ్యత్వ నమోదు ఉంటుంది.కొల్లాపూర్ లో రేవంత్, మధిర లో సిఎల్పీ నేత భట్టి సభ్యత్వ నమోదులో పాల్గొంటారు. 30 లక్షల సభ్యత్వం లక్ష్యం గా పెట్టుకున్నాము. జనవరి 26…
నిజామాబాద్ జిల్లాలోని భీంగల్‌లో టీఆర్‌ఎస్ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో పాల్గొన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధిపనులు వేగంగా జరుగుతున్నాయని, ఎమ్మెల్సీ కవిత ఆలోచన కృషి వల్లనే భీంగల్ మునిసిపాలిటీగా మారి అభివృద్ధిపథంలో నడుస్తోందని ఆయన అన్నారు. గతంలో కనీవినీ ఎరుగని రీతిలో భీంగల్ పట్టణం ప్రగతి సాధిస్తోందని, కేసీఆర్‌ను కడుపులో పెట్టుకుంటున్న గ్రామాలను అభివృద్ధి చేసే భాద్యత మాదే అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా తెలంగాణలో అమలయ్యే సంక్షేమ పథకాలు…
తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై టీఆర్‌ఎస్, బీపేజీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వడం లేదంటూ అధికార టీఆర్‌ఎస్ పార్టీ నేతలు అంటుంటే.. ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వం కొంటుందని బీజేపీ నేతలు హామీలు ఇస్తున్నారు.ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మేము టీఆర్‌ఎస్‌కో, కేసీఆర్‌కో భయపడేవాళ్ల కాదని.. ఒకవేళ భయపడితే రైతులకు భయపడుతామని ఆయన అన్నారు. అంతేకాకుండా మెడ మీద కత్తిపెట్టి సంతకం…
తెలంగాణలో టీఆర్ఎస్ ను తరిమికొడతాం. ఈ మహోద్యమంలో ఉద్యమకారులంతా కలిసి రండి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ అన్నారు. “తీన్మార్” మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ బీజేపీలో చేరారు. తెలంగాణలో ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్న. ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న వ్యక్తి బీజేపీలో చేరడం సంతోషంగా ఉంది. హృదయపూర్వకంగా బీజేపీలోకి స్వాగతం పలుకుతున్నాం. మల్లన్న నిఖార్సయిన తెలంగాణ వాది, ఉద్యమకారుడు. స్వార్థంతో మల్లన్న బీజేపీలో చేరడం లేదు. నరేంద్ర మోడి ప్రభుత్వం…
ఉద్యోగ సంఘాల నేతలుగా ఓ వెలుగు వెలిగి.. టీఆర్ఎస్‌లో పదవులు అనుభవించి.. ఇప్పుడు ఎందుకు కారు దిగి వెళ్లిపోతున్నారు? బీజేపీవైపు అడుగులు వేయడం వెనక వారి ఆలోచనలేంటి? ఉద్యోగ, రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? తెలంగాణ ఉద్యమ సమయంలో టీజేఏసీలో ఉద్యోగ సంఘాలది కీలక పాత్ర. పలు ఉద్యోగ సంఘాల నేతలు గులాబీ దళపతి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచారు. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో రావడంతో.. ఉద్యమంలో కలిసి వచ్చిన ఉద్యోగ సంఘాల నేతలకు పార్టీ పదవులు కట్టబెట్టి…
లీడర్స్ ఫర్ సేల్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తున్న మాట. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొందరు నాయకులు అమ్ముడు పోయారనే ఆరోపణలు రచ్చ రచ్చ చేస్తున్నాయి. ఎవరు బాగోతం ఏంటో తెలుసుకునేందుకు.. ఏకంగా లై డిటెక్టర్ పరీక్షలకు సవాళ్లు విసురుకుంటున్నారు. ఆ సంగతేంటో ఈ స్టోరీలో చూద్దాం. కాంగ్రెస్, బీజేపీ మధ్య సోషల్ మీడియాలో వార్..! ఎన్నికలంటేనే.. బోల్డంత డబ్బు ఖర్చుపెట్టాలి. ఓటర్లకు పంచడం ఎలా ఉన్నా.. ప్రత్యర్థులను దారిలోకి తెచ్చుకునేందుకు నోట్ల కట్టలతో కొడతారు. దీపం…
ఒక్క జిల్లా.. రెండు ఎమ్మెల్సీ స్థానాలు.. ఐదుగురు మంత్రులు. ఇది అధికారపార్టీ రచించిన పంచతంత్రం. ఎందుకు అక్కడంత ప్రత్యేకత? స్పెషల్ ఫోకస్ వెనక కారణం.. రెబల్ అభ్యర్థికి చెక్ పెట్టడమేనా? కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేదెవరు? తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరుచోట్ల ఈ నెల 10న పోలింగ్ జరగనుంది. ఇప్పటికే అధికారపార్టీ నుంచి స్పెషల్ క్యాంపులు జోరు పెరిగింది. పోలింగ్ జరిగే ఆరింటిలో కరీంనగర్‌లో జరిగే రెండు స్థానాలపైనే పొలిటికల్ సర్కిళ్లలో ఆసక్తికర చర్చ…