ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆర్ధిక శాఖ మంత్రిగా పలు పదవులకు వన్నె తెచ్చిన రోశయ్య, సౌమ్యుడిగా, సహన శీలిగా, రాజకీయాల్లో తనదైన శైలిని ప్రదర్శించేవారు అని గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కొణిజేటి రోశయ్య మృతి బాధాకరమని నారా చంద్రబాబునాయుడు అన్నారు. రోశయ్య పరిపాలనాదక్షుడిగా, ఆర్థిక నిపుణుడిగా…
ధాన్యం కొనుగోళ్ల అంశానికి సంబంధించి.. తదుపరి కార్యాచరణ విషయమై.. ముఖ్యమంత్రి కేసీఆర్.. ఫోకస్ చేశారు. ఇందులో భాగంగా ఇవాళ మరోసారి దాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్. ఇవాళ వ్యవసాయ శాఖ అధికారులు, టీఆర్ఎస్ ఎంపీలతో ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించనున్నారు తెలంగాణ సీఎం. ధాన్యం కొనుగోళ్ల విషయం పై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటు ఉభయ సభల్లో ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్…
టీఆర్ఎస్ పార్టీలో శిలాఫలకం చిచ్చురేపింది. స్వంత పార్టీ నేతల మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతోంది. తాండూరు గులాబీ పార్టీలో వర్గపోరు తారస్థాయికి చేరింది. ఎమ్మెల్యే వర్గం నేతలు అభ్యంతరం తెలపడంతో శిలాఫలకం ధ్వంసం అయింది. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి సమాచారం ఇవ్వకుండానే జెడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి వివిధ కార్యక్రమాలు చేపట్టారు. దీనిపై ఎమ్మెల్యే వర్గం గుర్రుగా వుంది. పెద్దేముల్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రంగంలోకి దిగిన…
నిన్న మొన్నటి వరకు బలం మనదే అనే ధీమా వారిలో కనిపించింది. సీన్ కట్ చేస్తే వెన్నులో ఎక్కడో వణుకు మొదలైంది. ఆదివాసీలు ఒకే స్వరం అందుకోవడం.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థికి మద్దతుగా నిలవడం.. అధికారపార్టీ నేతలకు నిద్రలేకుండా చేస్తోందట. ఎమ్మెల్సీ ఎన్నికలు.. జిల్లాలో రాజకీయ సెగలు..! అధికారపార్టీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక్కసారిగా పొలిటికల్ హీట్ రాజేశాయి. టీఆర్ఎస్ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవం అనుకుంటున్న సమయంలో…
వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయినప్పటి నుంచి ఆందోళన చేస్తూ వస్తున్న తెలంగాణ ఎంపీలు.. ఇవాళ లోక్‌సభ, రాజ్యసభలో ఈ విషయాన్ని లేవనెత్తారు.. లోక్‌సభలో ధాన్యం సేకరణపై మాట్లాడిన ఎంపీ నామా నాగేశ్వరరావు.. తెలంగాణ రైతుల ధాన్యం సేకరణ గురించి గత ఐదు రోజుల నుంచి ఆందోళన చేస్తున్నామని తెలిపారు.. తెలంగాణలో రైతులకు ఉచితంగా 24 గంటలు కరెంటు ఇస్తున్నాం.. రైతు బంధు ఎకరానికి 10 వేలు ఇస్తున్నాం.. కాళేశ్వరం ప్రాజెక్టు…
ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కడియం శ్రీహరి మాటల దాడులను పెంచారు. ఆయన ఏకంగా కాంగ్రెస్, బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ నేతలను బేవకూఫ్‌లు అని సంబోధించారు. బీజేపీ రైతులపై చిత్తశుద్ధి ఉంటే యాసంగిలో ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించాలని డిమాండ్ చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు దమ్ము లేదని రాజకీయ పబ్బం గడుపుకోవడానికే రైతులను అడ్డం పెట్టుకున్నారని ఆయన విమర్శించారు. పనిచేసే వారిని చేయనివ్వరు వారు…
యాసంగి ధాన్యం కొనుగోలుపై కేంద్రం స్పష్టతనివ్వకపోవడంతో రైతులు పంట మార్పిడి విధానాన్ని అవలంభించాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఈ రోజు సీఎం కేసీఆర్ వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలో వివిధ రకాల పంటలను పరిశీలించారు. అంతేకాకుండా అక్కడి రైతులతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ.. వేరుశనగ, పత్తి, మినుములు, పెసర్లు సాగు చేయాలన్నారు. వరిలాంటి ఒకే రకం పంట వేసి ఇబ్బంది పడొద్దని, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలని ఆయన…
సీఎం కేసీఆర్ ఇక జైలుకు పోవడం ఖాయమని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. కేసీఆర్‌పై వస్తున్న ఆరోపణలపై త్వరలోనే సీబీఐ, ఈడీ విచారణ చేస్తుందని వంద శాతం జైలు ఊచలు లెక్కపెట్టక తప్పదన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజీల్‌పై పన్ను తగ్గిస్తే రాష్ర్ట ప్రభుత్వం ఎందుకు తగ్గించలేదని ఆయన అన్నారు. ఇప్పటికైనా పెట్రో, డీజీల్‌పై పన్నును తగ్గించి ప్రజలపై భారం పడకుండా చూడాలన్నారు. డిజీల్ ధరలు…
టీఆర్ఎస్ నేత బండ ప్రకాష్ రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. రాజ్యసభ ఛైర్మన్‌కు తన రాజీనామా లేఖను బండ ప్రకాశ్ సమర్పించారు. ఇటీవలే బండ ప్రకాశ్ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన రాజ్యసభకు రాజీనామా చేశారు. వరంగల్‌లో 1954 ఫిబ్రవరి 18న జన్మించారు బండప్రకాశ్. ఎంఏ, పీహెచ్‌డీ చేశారు ప్రకాష్. కాకతీయ యూనివర్సిటీ వరంగల్ నుండి 1996లో పి.హెచ్.డి పట్టా పొందారు. తెలంగాణలోని పలు సామాజిక, స్వచ్ఛంద సంఘాలకు అధ్యక్షునిగా, కార్యదర్శిగా…
పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో తెలంగాణ రైతుల సమస్యల గురించి పార్లమెంట్‌లో మాట్లాడుతుంటే… రెండు సభలోని చర్చ జరగాలని ప్రతిపాదించినా కేంద్రం స్పందించడం లేదన్నారు. తప్పుడు సమాచారం ఇస్తూ తెలంగాణ రైంతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నారు. సభలో మా గొంతు నొక్కుతున్నారు. ఇది తెలంగాణ రాష్ర్ట సమస్య, రైతుల గురించి పోరాడుతున్న మాపై బీజేపీ ఎంపీలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. లోక్‌సభ, రాజ్యాసభలో నిరసన తెలిపామన్నారు. కేంద్రం మీద బియ్యం కొనాల్సిన బాధ్యత ఉన్న ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు.…