ఉద్యమకారులు అందరూ కేసీఆర్ నీ వదిలి బయటికి రావాలని ఉద్యమకారులకు ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన మాజీమంత్రి ఈటెల రాజేందర్ కు బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ముత్యాలమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేసిన ఈటల రాజేందర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 19 మంది ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరుగుతుంటే ఒకే ఒక్కటి ఎస్సీ లకు ఇచ్చారని,ఎస్టీలకు ఒక్కరికీ ఇవ్వలేదని అన్నారు.మైనార్టీలకు ఉన్న ఒక్కటి లాక్కొని వారి కళ్లలో మట్టి కొట్టారని ఆయన అన్నారు.కేసిఆర్‌కి సామాజిక స్పృహ లేదు, సామాజిక న్యాయం చెయ్యరని అన్నారు.
అడుగులకు మాడుగులోత్తే వారికి మాత్రమే పదవులు ఇస్తారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ మాటలకు చేసే పనులకు సంబంధం ఉండదని విమర్శించారు. మన వర్గాల మీద కేసిఆర్‌కీ చులకన భావన ఉన్నదని, ఆచరణలో అది అర్థం అయ్యాక కేసిఆర్‌తో ఉండవద్దని, ఉద్యమకారులు అందరూ కేసిఆర్ నీ వదిలి బయటికి రావాలని పిలుపు నిచ్చారు. బీజేపీ పార్టీ ఉద్యమకారులను హక్కున చేర్చుకుంటుందన్నారు. టీఆర్‌ఎస్‌లో ఉద్యమకారులకు సరైన గుర్తింపు లేదని ఈటల రాజేందర్ అన్నారు. టీఆర్‌ఎస్‌కు త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారని ఆయన అన్నారు.