రాష్ర్టప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన తెలంగాణకు హరితహారం పథకం ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగడానికి రాష్ర్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆకుపచ్చ తెలంగాణ మార్చడానికి కేసీఆర్ సర్కార్ నిరంతరం కృషి చేస్తోంది. ఇప్పటికే ఈ పథకాన్ని గ్రామస్థాయి నుంచి అమలు చేసి హరిత తెలంగాణ నిర్మించడంలో ప్రభుత్వం కొంతమేరకు విజయవంతం అయిందని చెప్పవచ్చు. ఈ పథకంలో గ్రామ స్థాయినుంచి ప్రతి ఒక్కర్ని భాగస్వామ్యం చేసి మంచి ఫలితాలు సాధించారు. Also Read: ఇక్కత్ చేనేత కార్మికులకు ప్రోత్సాహం:…
కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రులలో తయారు చేస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి హారీష్ రావు అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రుల్లో రూ.12 కోట్ల విలువైన ఆధునిక పరికరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఈ పరికరాలు సామాన్యుల వైద్యానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. జన్యు లోపాలపై ఆధునిక వైద్యం, బోన్ లోపాలు ముందే తెలుసుకునే ఆధునిక పరికరాలను ప్రభుత్వ ఆస్పత్రిలో తొలిసారి ఏర్పాటు చేశామని తెలిపారు. నిమ్స్‌లో 155 ICU బెడ్స్ అందుబాటులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేపల పంపిణీ కార్యక్రమంలో అవకతవకలు వస్తున్నాయన్న విమర్శలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. ప్రభుత్వం మత్స్యకారులకు నాణ్యమైన చేప పిల్లలు, రొయ్య పిల్లలను పంపిణీ చేస్తుందని మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ పథకం తీసుకొచ్చిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి రొయ్యల పంపిణీలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నల్గొండ జిల్లా కొండ భీమనపల్లి చెరువులో విడుదల…
అనాధ పిల్లలకు తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అనాధ పిల్లల భవిష్యత్ కోసం బలమైన పునాది వేసేలా, వారికి అన్ని తానై విద్యాబుద్ధులు నేర్పించి వారి కాళ్లపై వారు నిలబడేలా సర్కార్ చేస్తుంది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న 300 బాలల సంరక్షణ కేంద్రాల్లో అనాధ పిల్లలకు అన్ని రంగాలపై సంపూర్ణ అవగాహన కల్పిస్తుంది. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడం కోసం రెండు రోజులు వేదిక్ మ్యాథ్స్, అడ్వాన్స్ ఇంగ్లీష్,…
రాష్ర్టంలో ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. నెలరోజుల కిందట కోసిన పంట కూడా ఇప్పటికి తూకానికి రాని పరిస్థితి. రాష్ర్టంలో చాలా జిల్లాల్లో ఇలాంటి పరిస్థితులే నెలకొని ఉన్నాయి. కల్లాలు, రోడ్ల మీద కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన పంటను కొనేవారు లేక రైతులు దిగాలుగా దిక్కులు చూస్తున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో పలు జిల్లాలో ధాన్యం తడిసిపోయింది. నల్లగొండ, నిజామాబాద్ వంటి జిల్లాలో కొనుగోలు కేంద్రాల్లో తడిచిన ధాన్యం మొలకలు వచ్చింది. రాష్ర్టంలో ఆలస్యంగా కోతలు…
గంజాయితో వచ్చే ఇబ్బందులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక విషయాలను చర్చిం చడంతోపాటు గంజాయి పండించే వారిని హెచ్చరించారు. గంజాయి పండిస్తే రైతు బంధు, దళిత బంధు ఇవ్వమని, పక్క రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా పండిస్తున్నారని మంత్రి అన్నారు. గంజాయి మీద నిఘా పెట్టామని మంత్రి తెలిపారు. గంజాయితో పట్టుబడితే పీడీ యాక్ట్‌లు పెడతామని ఆయన హెచ్చరించారు. డిసెం బర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి వస్తుందని…
మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లపై ప్రభుత్వం మార్గ దర్శకాలు విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ, గౌడ్‌లకు ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం రిజర్వేషన్ల ప్రకారం దుకాణాలు కేటాయిం చేందుకు మార్గదర్శకాలనను ప్రకటించింది. కొత్త జిల్లాలను యూని ట్‌గా చేసుకుని కేటాయింపులు చేసేందుకు కలెక్టర్లకు అధికారం ఇచ్చింది. ఈ కేటాయింపుల కోసం నేతృత్వంలో నలుగురు సభ్యు లతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సభ్యులుగా జిల్లా ఎక్సైజ్ అధికారి,గిరిజన అభివృద్ధి అధికారి, బీసీ సంక్షేమ అధికారి, ఎస్సీ అభివృద్ధి…
యాసంగిలో వరి విత్తనాల అమ్మకాలపై సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు విచారణ జరిపింది. వరి విత్తనాలు అమ్మకూడదని సిద్దిపేట కలెక్టర్ మౌఖిక ఆదేశాలు ఇచ్చారని, దీనిపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోర్టును కోరారు. సిద్దిపేట కలెక్టర్, తెలంగాణ ప్రభుత్వం, సిద్దిపేట వ్యవసాయ అధికారి, మండల వ్యవసాయ అధికారిని ప్రతివాదులుగా పిటిషనర్ చేర్చారు. ఈ కేసులో ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. Read Also: మరోసారి చైతన్య ఇంటికి సమంత..?…
కమలాపూర్ మండలం లోని శ్రీరాములపల్లి గ్రామంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అందులో ఈటల రాజేందర్ మాట్లాడుతూ… కేసీఆర్ మాట్లాడితే ఒకనాడు తెలంగాణ పులకించింది. అడుగులో అడుగు వేసింది. ఈ రోజు ఎవరు ఎక్కువ ఆయన్ను తిడితే అంత ప్రజలు చప్పట్లు కొడుతున్నారు. అంటే అయన పెరిగినట్ట, తరిగినట్టా? అయన చరిత్ర హీనం అవుతుంది. కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉండి కత్తి అందిస్తే హరీష్ వచ్చి పొడుస్తుండు. కాళోజీ చెప్పినట్టు ప్రాంతం…
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం బత్తినివాని పల్లిలో మంత్రి నేడు ఈటల ఎన్నికల ప్రచారం చేసారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ… ఓట్ల కోసం ఏది అడిగితే అది ఇస్తారట. నామీద దాడి చేసేందుకు పదుల సంఖ్యలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఇక్కడ తిరుగుతున్నారు. వాళ్ల నియోజకవర్గాలను పట్టించుకుని ఎమ్మెల్యేలు ఇక్కడ మాత్రం ఏదేదో మాట్లాడుతున్నారు. కూట్లే తీయలేనోడు.. ఏట్లో రాయి తీసినట్లుగా ఇక్కడ హామీలిస్తున్నారు. దళితబంధు సహా.. అనేక హామీలు ఇస్తున్నారంటే అవన్నీ మీపై ప్రేమతో…