పంటను కొనేవారు లేక దిక్కులు చూస్తున్న రైతన్నలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ర్టంలో ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. నెలరోజుల కిందట కోసిన పంట కూడా ఇప్పటికి తూకానికి రాని పరిస్థితి. రాష్ర్టంలో చాలా జిల్లాల్లో ఇలాంటి పరిస్థితులే నెలకొని ఉన్నాయి. కల్లాలు, రోడ్ల మీద కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన పంటను కొనేవారు లేక రైతులు దిగాలుగా దిక్కులు చూస్తున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో పలు జిల్లాలో ధాన్యం తడిసిపోయింది. నల్లగొండ, నిజామాబాద్ వంటి జిల్లాలో కొనుగోలు కేంద్రాల్లో తడిచిన ధాన్యం మొలకలు వచ్చింది. రాష్ర్టంలో ఆలస్యంగా కోతలు జరిగే మహబూబ్‌నగర్, ఖమ్మం, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాలో కూడా రైతులు ధాన్యం కుప్పలను రోడ్లమీద, కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోశారు. వరిసాగు, ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలని కేంద్రప్రభుత్వాన్ని, రాష్ర్ట ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది.
మరోవైపు చాలా జిల్లాలో లారీల రవాణా కాంట్రాక్టు, హమాలీల సమస్య కొలిక్కిరాలేదు. ధాన్యంలో తేమను లెక్కవేసేపరికరాలు, తూకం యంత్రాలు చాలా ప్రాంతాల్లో పనిచేయడం లేదు. వీటికీ ఓటీపీ సమస్య కూడా తోడవ్వడంతో ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం అవుతుంది. ప్రస్తుత వానాకాలం సీజన్‌లో రాష్ర్టంలో 61.75 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైంది. దీని ప్రకారం1.35 కోట్ల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. స్థానిక అవసరాలు, మిల్లర్ల కొనుగోళ్లు, విత్తనాలకు పోగా 1.03 కోట్ల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ర్టంలో 6,873 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ఇప్పటి వరకు కేవలం 5,461 కేంద్రాలను మాత్రమే తెరిచారు. కానీ 4,082 కేంద్రాల్లో మాత్రమే కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. గత నెల 25వ తేదీన అధికారికంగా కొనుగోళ్లు ప్రారంభించినప్పటికీ నెల రోజుల వ్యవధిలో కేవలం 16.76 లక్షల టన్నుల ధాన్యాన్ని మాత్రమే పౌర సరఫరాల సంస్థ కొనుగోలు చేసింది. ఇది లక్ష్యంలో కేవలం 15 శాతమే అవ్వడం గమనార్హం.
Also Read
- TG SAFE: హైదరాబాద్లో అక్రమ డైరీ దందా గుట్టురట్టు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- Congress Councillors: కాంగ్రెస్కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
ఇటీవలి వర్షాల నేపథ్యంలో ఒక్కసారిగా కొనుగోళ్లు మందగించాయి. ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉండటంతో నిర్వాహకులు కొనుగోలు చేయడం లేదు. దీంతో 4వేల కేంద్రాల్లో రోజుకు కనీసం లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా సేకరణ జరగడం లేదు. మంగళవారం రాష్ర్టంలో కొనుగోళ్లు ప్రారంభించిన 26 జిల్లాల్లో 95 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. గత యాసంగి సీజన్ ధాన్యం నిల్వలు రైస్ మిల్లులో, గోదాముల్లో నిల్వ ఉండటంతో అవి ఖాళీ అయ్యే పరిస్థితి ఆధారంగా కొత్త స్టాక్‌ను మిల్లులకు పంపిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 16.76 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, రైతులకు రూ.3.281.71 కోట్లు చెల్లించాల్సి ఉంది.
కాగా పౌర సరఫరాల సంస్థ ఆయా జిల్లాలకు రూ.912.62 కోట్లు విడుదల చేసింది. నల్లగొండ జిల్లాలో ఈ సీజన్‌లో 5.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్‌కు వస్తుందని అంచనా వేశారు. కానీ ఇప్పటి వరకు 12,425 మంది రైతుల నుంచి కేవలం 96,673 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. పెద్దపల్లి జిల్లాలో దిగుబడి అంచనా 5 లక్షల మెట్రిక్ టన్నులు కాగా కొనుగోలు లక్ష్యం 4.46 లక్షల మెట్రిక్ టన్నులుగా నిర్ధారించారు. కానీ ఇప్పటి వరకు కొనుగోలు చేసింది మాత్రం 54,015 టన్నులు మాత్రమే… దీంతో ధాన్యం సేకరణపై ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అన్నదాతలు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. ఇప్పటికైనా ధాన్యం కొనుగోలు చేయాలని రైతన్నలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
తాజావార్తలు
-
Samsung Galaxy F70 5G: సామ్ సంగ్ Galaxy F70 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 120Hz డిస్‌ప్లే!
-
CM Chandrababu: ‘స్వయం ఏపీ’ బ్రాండ్.. 10 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం!
-
Rashmika : 400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
Aadarsha Kutumbam : ఆదర్శ కుటుంబం జాడేది?
ట్రెండింగ్
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!