యాసంగిలో వరి విత్తనాల అమ్మకాలపై సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు విచారణ జరిపింది. వరి విత్తనాలు అమ్మకూడదని సిద్దిపేట కలెక్టర్ మౌఖిక ఆదేశాలు ఇచ్చారని, దీనిపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోర్టును కోరారు. సిద్దిపేట కలెక్టర్, తెలంగాణ ప్రభుత్వం, సిద్దిపేట వ్యవసాయ అధికారి, మండల వ్యవసాయ అధికారిని ప్రతివాదులుగా పిటిషనర్ చేర్చారు. ఈ కేసులో ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు.
Read Also: మరోసారి చైతన్య ఇంటికి సమంత..?
వరి విత్తనాల అమ్మకాలను ప్రొహిబిషన్ యాక్ట్‌లో ఏమైనా చేర్చారా అని హైకోర్టు ప్రశ్నించింది. అలాంటిదేమీ లేదని ఏజీ ప్రసాద్ కోర్టుకు తెలిపారు. అలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకోలేదని, ఇకపై కూడా తీసుకోబోదని హామీ ఇచ్చారు. అయితే రైతుల విషయంలో కలెక్టర్ ఎలా వ్యాఖ్యలు చేస్తారని హైకోర్టు ప్రశ్నించారు. కలెక్టర్ తీరుపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసులో క్రిమినల్ కంటెంట్ కనబడుతోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ బెంచ్‌కు బదిలీ చేయాలని రిజిస్ట్రార్‌ను ఆదేశించింది.