కమలాపూర్ మండలం లోని శ్రీరాములపల్లి గ్రామంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అందులో ఈటల రాజేందర్ మాట్లాడుతూ… కేసీఆర్ మాట్లాడితే ఒకనాడు తెలంగాణ పులకించింది. అడుగులో అడుగు వేసింది. ఈ రోజు ఎవరు ఎక్కువ ఆయన్ను తిడితే అంత ప్రజలు చప్పట్లు కొడుతున్నారు. అంటే అయన పెరిగినట్ట, తరిగినట్టా? అయన చరిత్ర హీనం అవుతుంది. కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉండి కత్తి అందిస్తే హరీష్ వచ్చి పొడుస్తుండు. కాళోజీ చెప్పినట్టు ప్రాంతం వాడిని ఇక్కడే పాతి పెట్టాల్సిందే. అణిగి మనిగి ఉంటే కెసిఆర్ పొగుడుతారు. ప్రశ్నిస్తే పంపిస్తాడు. కేసీఆర్ నువ్వు కాదు నీ జేజెమ్మ వచ్చినా ఇక్కడ గెలవలేవు. కేసీఆర్ బానిసల్లార మీ భరతం పట్టే రోజు దగ్గర్లో ఉంది. ఇందుకేనా మీ ప్రజలు మీకు ఓట్లు వేసి గెలిపించింది. వచ్చే ఎన్నికల్లో మీకు ఘోరీ కట్టుడు తధ్యం. నేను పరకాల, వర్ధన్నపేటకు వస్తా. కళ్ళు ఉండి చూడలేని కబోదులు, అబద్దాల కోరులు మామ, అల్లుడు. 18 ఏళ్లుగా కడుపులో పెట్టుకున్నారు.. మళ్ళీ ఆశీర్వదించండి. మీ రుణం తీర్చుకుంట. తెరాస వాళ్ళు ఇచ్చేవి అన్నీ తీసుకోండి. దానికి కారణం అయిన నన్ను ఆశీర్వదించండి అని అడిగారు.