రొయ్య పిల్లల పంపిణీ పర్యవేక్షణకు కమిటీ: శ్రీనివాస్ యాదవ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేపల పంపిణీ కార్యక్రమంలో అవకతవకలు వస్తున్నాయన్న విమర్శలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. ప్రభుత్వం మత్స్యకారులకు నాణ్యమైన చేప పిల్లలు, రొయ్య పిల్లలను పంపిణీ చేస్తుందని మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ పథకం తీసుకొచ్చిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి రొయ్యల పంపిణీలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నల్గొండ జిల్లా కొండ భీమనపల్లి చెరువులో విడుదల చేసిన రొయ్య పిల్లల నాణ్యతపై వచ్చిన ఫిర్యాదుపై ఆయన ఆగ్రహంగా ఉన్నారు. దీనిపై విచారణ చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కాగా ఇప్పటికే ప్రభుత్వం కోట్లు ఖర్చు పెట్టి ఈ పథకాన్ని అమలు చేస్తుందని అలాంటి పథకంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చూస్తు ఊరుకోబోమని ఆయన తెలిపారు. లబ్ధి దారులకు నాణ్యమైన చేప పిల్లలు, రొయ్య పిల్లలను పంపిణీ చేయాల్సిన బాధ్యత అధికారులదేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.
Also Read
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
- Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
తాజావార్తలు
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!