సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎంపీ, బీజేపీ నేత విజయశాంతి… సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆమె… వరుస ట్వీట్లతో ప్రభుత్వాన్ని ఎండగట్టారు.. ‘రాష్ట్రంలో రైతుల కోసం ఎన్నో పథకాలను తీసుకొచ్చామని, రైతుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నా… రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు మాత్రం కొనసాగుతున్నాయి. రైతులకు పంట రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు’…
ఇక్కడ భూమి ఒక్కరిది, రైతు బంధు ఒక్కరిది. భూ సమస్యల పరిష్కారం ఏమో కాని, ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నరు. భూమి ఉన్నోళ్లకు రైతు బంధు వస్తలేదు. అర్హులకు పథకాలు అందడం లేదు అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. ధరణి అనేదే సమస్యల పుట్ట అని చెప్పిన సీతక్క భూస్వాములకు ధరణిలో సమస్యలు లేవు. కొద్దీ మొత్తం భూమి ఉన్న రైతులకే ఈ సమస్యలు. వాళ్ళకి కావాల్సినవి సీక్రెట్ గా చేస్తరు. రైతులకు ఎంలేదు. దళిత బంధు…
అసెంబ్లీని కేవలం ఐదు రోజుల పాటే నడిపిస్తామని బీఏసీ నిర్ణయించడం బాధాకరం అన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చిన నాటి నుండి బీఏసీకి బీజేపీని ఆహ్వానించడంలేదన్న ఆయన.. మజ్లీస్ పార్టీ నేతలు చెప్పిన నాటి నుండి స్పీకర్ బీఏసీకి బీజేపీని ఆహ్వానించడంలేదన్నారు.. స్పీకర్ కావాలనే బీజేపీ ఎమ్మెల్యేలను ఆహ్వానించడం లేదని ఆరోపించిన ఆయన.. స్పీకర్ చైర్ అంటే మాకు గౌరవం.. కానీ, స్పీకర్ తీరు సరిగా లేదన్నారు.. మొదటి ప్రభుత్వంలో…
దాడులకు, కేసులకు కాంగ్రెస్ భయపడదు అని మధు యాష్కీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఇంటి పై దాడి అప్రజాస్వామికం.. కాంగ్రెస్ కార్యకర్తలపైన, నాయకులపైన కేసులు పెడుతూ దాడులు చేస్తున్నారు. గాంధీభవన్ లో కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు రక్షణ కల్పించేందుకు కాల్ సెంటర్ పెడుతున్నాం అని తెలిపారు. న్యాయ సలహాలు అందిస్తాం.. ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంభం పాలన చేస్తుంది. ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరికి పాలించే హక్కు లేకుండా పోయింది.…
కోవిడ్ విషయంలో ప్రపంచంలోనే భారత్ ఎక్కడ లేని విధంగా 77 కోట్ల డోసుల టీకాలు ఇచ్చింది. థర్డ్ వేవ్ మ్యుటేషన్ అయి వస్తే కూడా ప్రాణనష్టం జరగకుండా వ్యాక్సునేషన్ ను ఉద్యమంలా మార్చారు ప్రధాని మోడీ అని బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావ్ పీసీ అన్నారు. అలాగే తెలంగాణలో టీఆర్ఎస్ కు అన్ని విషయాల్లో ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీ మాత్రమే అని తెలిపారు. తెలంగాణ విమోచనం విషయంలో కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది. ఓటు బ్యాంకు…
టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళల్ని చీట్ చేస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ, పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి.. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు.. మహిళా సాధికారతకి కాంగ్రెస్ పెద్ద పీటవేసిందని.. కానీ, టీఆర్ఎస్ మహిళల్ని చీట్ చేస్తోంది.. ఒక్కో మహిళకు ఐదు నుండి 10 వేలు బాకీ ఉన్నారన్నారు. కాంగ్రెస్ మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చిందని గుర్తుచేసిన ఉత్తమ్.. కానీ, కేసీఆర్ సీఎం అయ్యాక… వడ్డీ…
రేవంత్ కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేసారు మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ, కాంగ్రెస్ నేతలు. అనంతరం దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ… చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ లో ఉత్సహం కనిపిస్తుంది. దళితులకు మూడెకరాలు ఇస్తామని 2014, ఆగస్ట్ 15 న సీఎం కేసీఆర్ మాట ఇచ్చారు. ఆరేండ్లు అయిన.. దళితులకు భూములియ్యలేదు. దళితులకు భూములు, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ హయాంలోనే. టీఆర్ఎస్.. 2018 నుండి ఎక్కడ ఎన్నికలు వచ్చిన డబ్బు వెదజల్లుతుంది…
20 ఏళ్ళు అధికారం మనదే అన్నప్పుడే కేసీఆర్ తన ఓటమిని అంగీకరించినట్లు. కేసీఆర్ కు 20 నెలల భయం పట్టుకుంది. మొదటి సారి కేసీఆర్ లో భయం కనిపిస్తుంది అందుకే అంచనాలు లేని హామీలు ఇస్తున్నారు అని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. మూడు చింతల పల్లి దీక్ష వద్ద రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం తరువాత పార్టీలో సీనియర్లు ఎవరు బ్రీఫ్ చేయలేదు. ఆఖరుకు కేసీఆర్ ఆవేదన చూసి కేటీఆర్…
ఈ ప్రభుత్వాన్ని బెదిరించినా, ప్రశ్నించినా మార్పు రాదు.. గద్దె దించడమే ఏకైక పరిష్కారం అంటూ.. కేసీఆర్ సర్కార్‌పై మండిపడ్డారు బీజేపీ నేత మురళీధర్‌రావు.. హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ పాలు పంచుకుందని.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రం సహకారం ఉందని.. కానీ, గత ఏడేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం సరైన దారిలో వెళ్లడం లేదని మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బతింది… ఉద్యమాల మీద లాఠీ దెబ్బలు పెరిగాయి… అధికార పార్టీ…
ప్రభుత్వం భూముల మార్కెట్ విలువ పెంచుతూ జీఓ విడుదల చేశారు. రిజిస్ట్రేషన్ చార్జీలను స్టాంప్ డ్యూటీ పెంచారు. ప్రభుత్వానికి భూముల మార్కెట్ విలువ పెంచడం ద్వారానే ఆదాయం వస్తుంది. కానీ మళ్ళీ రిజిస్ట్రేషన్ చార్జీలను స్టాంప్ డ్యూటీ ఎందుకు పెంచారు అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. దీనివల్ల సామాన్య ప్రజల పై ఆర్థిక భారం పడుతుంది. పెంచిన రిజిస్ట్రేషన్ చార్జీలను స్టాంప్ డ్యూటీ చార్జీలు వెంటనే తగ్గించాలి. తెరాస అధికారం లోకి…