ఆరిపోయే ముందు దీపానికి వెలుతురు ఎక్కువ అన్నట్లుగా.. ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. చిల్లర రాజకీయాలను ప్రజలు సపోర్టు చేయరు. హుజురాబాద్ ఒక్కటే కాదు.. అంతటా ఇలాంటి పరిస్థితి ఉంది. కార్యకర్తలు ఓపిక, సహనంతో పనిచేయాలి. అధికారంలో ఉన్నా, లేకున్నా ఇక్కడి ప్రజల కోసం ఎంతో పనిచేసాను మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, ఉద్యమకాలంలోనూ శక్తివంచన లేకుండా పనిచేసాను ప్రజల్లో బలమున్నవారు చేసే పనులు ఇవి కావు. బలహీనులు…
టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు సంవత్సరాలు అయినా నిరుద్యోగ యువతకు ఉద్యోగ భద్రత కల్పించలేకపోయిందని మంథని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ విమర్శించారు. మంథనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఏదో ఒకరోజు ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే రోజు వస్తుందన్నారు. వివిధ శాఖల్లో ఉద్యోగ ఖాళీల గురించి ప్రభుత్వానికే స్పష్టత లేదు. ఖాళీల విషయంలో చిత్తశుద్ధి లేని ప్రభుత్వం.. యువతి యువకులకు ఏలాంటి భరోసా…
తెలంగాణ దళిత సమాజం వద్దనున్న వ్యవసాయ భూమిని గణన చేయాలి. లెక్కలను స్థిరీకరించి ఒక సమగ్ర నివేదికను అందజేయాలి అని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. అవసరమైతే పది పదిహేను రోజులు దళితుల భూముల గణన మీదనే ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలి. దళితుల అభివృద్ధి కోసం సామాజికంగా, ఆర్థికంగా చేపట్టాల్సిన కార్యాచరణను దేనికది గా సిద్ధం చేసుకోవాలి అని అన్నారు. 35 నుంచి 40 వేల కోట్ల రూపాయలు సమకూర్చి, దళిత సాధికారత కోసం ఖర్చు చేయడానికి…
కెసిఆర్ ప్రభుత్వంపై విజయశాంతి ఫైర్ అయ్యారు. “తెలంగాణలో కీలక వ్యవస్థలు ఎంత దారుణంగా కుప్పకూలాయో అర్థం కావాలంటే నేటి పత్రికల్లో వచ్చిన కథనాల్ని గమనిస్తే చాలు. రాష్ట్రంలో భూములమ్మి ఎలాగేనా వేల కోట్ల రూపాయలు ఆదాయాన్ని సమకూర్చుకోవడం లక్ష్యంగా ఆగమేఘాల మీద రాష్ట్ర ప్రభుత్వం ఉరుకులు పరుగులు పెడుతోంది. ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన కేసీఆర్ గారు… నేడు భావితరాల ప్రయోజనాల కోసం రాష్ట్రంలో సర్కారు భూమి అన్నదే లేకుండా చేసేందుకు కుట్ర చేస్తున్నారు. అత్యంత కీలకమైన…
ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తెలంగాణ సర్కార్ పై ఫైర్ అయ్యారు. బంగారు తెలంగాణలో భూముల అమ్మకం ఏంటీ.. కేసీఆర్..? ఆదాయం కోసం నిన్న సిగ్గు లేకుండా మీటింగ్ పెట్టారని మండిపడ్డారు. ఎకానమీ పెంపుపై నిపుణులతో సమావేశం పెట్టాలని..బసవన్నలతో కాదని నిప్పులు చెరిగారు. టీఆరెస్ సర్కార్ తప్పుడు పనులు చేస్తుందని..ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ.. కేసీఆర్ పాలన సాగిస్తున్నాడని మండిపడ్డారు. ఆర్టికల్ 20 ప్రకారం గవర్నమెంట్ ట్రస్టీగానే పనిచేయాలని.. నన్ను తిట్టిన, చంపిన ప్రజల పక్షాన…
తెలంగాణ రాష్ట్రంలో దొంగల ప్రభుత్వం నడుస్తోందని..కిసాన్ మోర్చా ఇన్చార్జ్ ప్రేమేంధర్ రెడ్డి అన్నారు. ఏడేళ్ళలో ఎన్నికోట్ల నకిలీ విత్తనాలు అమ్మారు.. రైతులు ఎంతమేర నష్టపోయారో లెక్కలు తేల్చాలని డిమాండ్ చేశారు. నకిలీ విత్తనాలు అమ్మేవారిపై ఎన్ని పీడీ యాక్ట్ పెట్టారు.. రైతుబందు పేరుతో రైతులకు వచ్చే అనేక సబ్సిడీలను తెలంగాణ సర్కార్ కోత పెట్టిందన్నారు. డీఏపీ కేంద్ర ప్రభుత్వం సగం ధరకే ఇస్తుందనన్నారు. ఎరువులు ఉచితంగా ఇస్తా అన్న కేసీఆర్.. మాట నిలబెట్టుకుంటరా? లేదా..? రైతులకు అరచేతిలో…
టీఆర్ఎస్ సర్కార్ పై బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ ప్రక్షాళన ప్రారంభమైందని.. ప్రజలు ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. టీఆరెస్ పార్టీ ఒక గడిలా పార్టీ అని.. నిజాంను మైమరిపించే విధంగా ఒక రాక్షస నిరంకుశ పాలన కోనసాగిస్తున్నదని ఫైర్ అయ్యారు. ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న ఈటెలకు ఇవాళ టిఆర్ఎస్ పార్టీలో ఈ విధంగా జరిగిందంటే మిగతా వాళ్లు కూడా ఆలోచించు కోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.…
విద్య, వైద్యం, వ్యవసాయం, న్యాయం కోసం ప్రతిరంగంలోనూ ప్రజలు రోడెక్కుతున్నారని తెలంగాణ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు వైఎస్ షర్మిల. రాష్ట్రంలోని అన్నదాతలు రోడెక్కుతున్నారని, కొనుగోలు సెంటర్లలో వడ్లు కొనడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రతి రంగంలోనూ ప్రజలు రోడ్డెక్కి నిరసనలు తెలపాల్సి వస్తోందని అన్నారు. విద్య కోసం రోడ్డెక్కాలి.. వైద్యం కోసం రోడ్డెక్కాలి.. న్యాయం కోసం రోడ్డెక్కాలి.. పండిన పంట కొనుగోలు కోసం రోడ్డెక్కాలి.. కొన్న పైసల కోసం పాట్లు పడాలి.. నెలల…
టీఆర్ఎస్ సర్కార్ పై ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన పదికోట్ల ఆస్పత్రిని గత ఏడేళ్లుగా నిరుపయోగంగా టిఆర్ఎస్ సర్కార్ వదిలేసిందని.. కెసిఆర్ సర్కార్ వెంటనే ఖైరతాబాద్ లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వంద పడకల ఆస్పత్రిగా మార్చి పేద ప్రజలందరికీ ఇన్-పేషెంట్ కరోనా వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ టాస్క్ ఫోర్స్ టీమ్ ఎందుకు ఈ ఆస్పత్రులను పర్యటించి కోవిడ్ ఆస్పత్రులుగా మార్చడం లేదలని..…
తెలంగాణ సర్కార్ పై బిజేపి నేత విజయశాంతి ఫైర్ అయ్యారు. కేంద్రం కరోనా డోసులు ఇచ్చినప్పటికీ ప్రజలకు ఇవ్వడం లేదని ఆమె ఫైర్ అయ్యారు. “కోవిడ్ కట్టడి కోసం తెలంగాణకు సరఫరా చేస్తున్న ఆక్సిజన్ 450 నుంచి 650 మెట్రిక్ టన్నులకు… రెండెసివర్ ఇంజెక్షన్లను 10 వేలకు పెంచినందుకు కేంద్రానికి ధన్యవాదాలు. రాష్ట్రంలో థర్డ్ వేవ్ పై సర్కారు సన్నద్ధత, బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఏర్పాట్లు, కరోనాకు తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లల పరిస్థితిపై హైకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో…