భారత క్రికెట్ దిగ్గజం, టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మరో కీలక బాధ్యతను చేపట్టబోతున్నారు. త్రిపుర టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించబోతున్నారు. కోల్‌కతాలోని గంగూలీ నివాసంలో ఆయనతో త్రిపుర పర్యాటక శాఖ మంత్రి సుశాంత చౌదరి సమావేశమయ్యారు.
రోజు రోజుకు కామాంధులు రెచ్చిపోతున్నారు. త్రిపురకు చెందిన ఒక కళాశాల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. పశ్చిమ త్రిపుర జిల్లాలో కదులుతున్న కారులో కళాశాల విద్యార్థినిపై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం విషమ స్థితిలో ఉన్న ఆమెను పశ్చిమ త్రిపురలోని అమాతలి బైపాస్ వద్ద వదలిపెట్టి పరారయ్యారు.
Man Kills Minor Wife: త్రిపుర రాష్ట్రంలో ఘోరం జరిగింది. అగర్తాలలో 15 ఏళ్ల మైనర్ అయిన భార్యను అత్యంత దారుణంగా హత్య చేశాడు ఓ వ్యక్తి. మృతదేహాన్ని రెండు ముక్కలుగా నరికాడు. బాధితురాలు తనూజాబేగం శుక్రవారం ఉదయం నుంచి కనిపించకుండా పోయింది. గంటల తరబడి వెతికిన తర్వాత రెండు సంచుల్లో ఆమె మృతదేహం లభ్యమైంది. ఓ సంచితో తల, మరోసంచితో మిగతా శరీరం భాగం లభ్యం అయింది.
Tripura: త్రిపురలో మరోసారి బీజేపీ అధికారం చేపట్టబోతోంది. త్రిపుర ముఖ్యమంత్రిగా నేడు మాణిక్ సాహా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ హాజరుకానున్నారు. రాష్ట్రంలో బీజేపీని వరసగా రెండోసారి అధికారంలోకి తీసుకురావడంతో మాణిక్ సాహా కీలకంగా పనిచేశారు. దంతవైద్యుడు, రాజకీయనాయకుడిగా సాహాకు క్లీన్ ఇమేజ్ ఉంది. అగర్తలా వివేకానంద మైదాన్ లో ప్రమాణస్వీకారం జరగనుంది.
PM Modi to Attend Oath Ceremonies of Nagaland, Meghalaya CMs: ఈశాన్య రాష్ట్రాలు నాగాలాండ్, మేఘాలయాల్లో కొత్త ప్రభుత్వాలు కొలువుదీరబోతున్నాయి. మేఘాలయ సీఎంగా నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) నేత కన్రాడ్ సంగ్మా నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. సంకీర్ణంలో బీజేపీ కూడా భాగస్వామ్యం కాబోతోంది. ఇక నాగాలాండ్ లో నేషనలిస్టు డెమోక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ( ఎన్డీపీపీ) నేత నెపియూ రియో నేతృత్వంలో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. మంగళవారం రెండు రాష్ట్రాల…
PM Narendra Modi: ఈశాన్య రాష్ట్రాల్లో మరోసారి కమలం విరబూసింది. నాగాలాండ్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల్లో బీజేపీ మిత్రపక్షాలతో కలిసి అధికారం ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవుతోంది. గురువారం వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో కమలం పార్టీ భారీ విజయాన్ని దక్కించుకుంది. ఈ విజయంపై ప్రధాని నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు
ఈశాన్య భారతంలో కాషాయ జెండా మరోసారి రెపరెపలాడింది. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మూడు రాష్ట్రాల్లో బీజేపీ సత్తా చాటింది. బీజేపీ.. త్రిపురలో రెండో సారి అధికారంలోకి రాగా.. నాగాలాండ్‌లో బీజేపీ-ఎన్డీపీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
Tripura Election Results: ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్లే త్రిపులో బీజేపీ భారీ విజయం సాధించింది. కమ్యూనిస్టుల కంచుకోటను కూల్చిన బీజేపీ వరసగా రెండో సారి ఆ రాష్ట్రంలో అధికారాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధం అయింది. ఈ రోజు వెల్లడించిన అసెంబ్లీ ఫలితాల్లో మ్యాజిక్ ఫిగర్ ను దాటి మెజారిటీ స్థానాలు సాధించింది. త్రిపులో మొత్తం 60 స్థానాలు ఉంటే ఇప్పటికే బీజేపీ 34 చోట్ల విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే 26 చోట్ల విజయం…
Meghalaya Election Counting Updates : మేఘాలయ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్‌కు దగ్గర సంబంధం కనిపించినట్లు తెలుస్తోంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు.
Nagaland Election Counting Updates : నాగాలాండ్‌లో భాజపా నేతృత్వంలోని కూటమి భారీ విజయంతో దూసుకుపోతోంది. నాగాలాండ్‌లో బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణం భారీ మెజార్టీతో విజయం సాధించేందుకు సిద్ధంగా ఉంది.