Nagaland Election Counting Updates : నాగాలాండ్‌లో భాజపా నేతృత్వంలోని కూటమి భారీ విజయంతో దూసుకుపోతోంది. నాగాలాండ్‌లో బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణం భారీ మెజార్టీతో విజయం సాధించేందుకు సిద్ధంగా ఉంది. బిజెపి, దాని మిత్రపక్షమైన నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్‌డిపిపి) 60 సీట్లలో 49 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. మెజార్టీ రావాలంటే ఫలితాల్లో 31మార్క్ సాధించాలి. నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పిఎఫ్) ఆరు స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ ఒక్క చోట మాత్రమే ఆధిక్యంలో ఉంది.
Read Also: Election Updates: త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం
సీట్ల షేరింగ్ ఒప్పందం ప్రకారం మిత్రపక్షమైన ఎన్‌డిపిపి 40 స్థానాల్లో పోటీ చేయగా, 20 స్థానాల్లో పోటీ చేసిన ప్రముఖ కూటమిలో బిజెపి జూనియర్ భాగస్వామిగా ఉంది. ముఖ్యమంత్రి నీఫియు రియో నేతృత్వంలోని ఎన్‌డిపిపి 2018లో గత ఎన్నికల నుండి బిజెపితో పొత్తులో ఉంది. గత ఎన్నికల్లో కూటమి 30 సీట్లు గెలుచుకోగా, ఎన్‌పిఎఫ్ 26 గెలుచుకుంది. 1963లో రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి నాగాలాండ్‌లో 14సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగనప్పటికీ ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో మహిళా ఎమ్మెల్యే లేరు.