ప్రధాని మోడీ సోమవారం రెండు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. అరుణాచల్‌ప్రదేశ్, త్రిపుర రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. రూ.5,100 కోట్ల విలువైన ప్రాజెక్ట్‌లను ప్రారంభించనున్నారు. జలవిద్యుత్, మౌలిక సదుపాయాలు, మాతా త్రిపుర సుందరి ఆలయ అభివృద్ధి సహా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.
Infiltrators: అక్రమంగా తమ రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తున్న బంగ్లాదేశీయులపై పలు ఈశాన్య రాష్ట్రాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా, అస్సాం, త్రిపురతో పాటు చాలా ఈశాన్య రాష్ట్రాలు బంగ్లాదేశీ చొరబాటుదారులతో విసిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయా రాష్ట్రాలు వీరిని బహిష్కరించేందుకు చర్యల్ని ప్రారంభించాయి. ఇప్పటికే అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, అక్రమ బంగ్లాదేశీయులను గుర్తించి, వారు ఆక్రమించిన స్థలాలను విముక్తి చేస్తున్నారు.
Delhi: ఆరు రోజుల క్రితం తప్పిపోయిన త్రిపురకు చెందిన చెందిన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని స్నేహ దేబ్నాథ్ మృతదేహం లభ్యమైంది. 19 ఏళ్ల ఆమె డెడ్‌బాడీని దేశ రాజధానిలోని ఓ ఫ్లై ఓవర్ కింద పోలీసులు గుర్తించారు. ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. డెడ్‌బాడీని పోస్టుమార్టం కోసం తరలించారు. స్నేహ ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే సూసైట్ నోట్ రాసినట్లు పోలీసులు తెలిపారు.
Body Found In Freezer: మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పెళ్లై రెండు వారాలు గడవక ముందే భర్తను భార్య దారుణంగా చంపించింది. ఈ ఘటన మరువక ముందే ఈశాన్య రాష్ట్రానికి చెందిన త్రిపురలో ఇలాంటి ఘటన మరోక్కటి జరగడంతో.. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతుంది.
Bangladesh: భారతదేశంలోని ఇద్దరు సీనియర్ దౌత్యవేత్తలు తక్షణమే తిరిగి రావాలని బంగ్లాదేశ్ సర్కార్ ఆదేశించింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగిపోతున్నాయి. కోల్‌కతాలోని డిప్యూటీ హైకమిషనర్ షిక్దార్ మహమ్మద్ అష్రఫుల్ రహ్మాన్, త్రిపురలోని అగర్తలలో గల అసిస్టెంట్ హైకమిషనర్ ఆరిఫ్ మహమ్మద్‌ను రీకాల్ చేస్తున్నట్లు బంగ్లాదేశ్ ప్రకటించింది.
Bangladesh: షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందువులపై అఘాయిత్యాలు పెరిగాయి. హిందూ నేతల అరెస్టులు, హిందువుల ఆలయాలు, ఆస్తులు, వ్యాపారాలు, ఇళ్లపై మతోన్మాద మూక దాడులకు తెగబడుతోంది. తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ఉన్న మహ్మద్ యూనస్ అక్కడి అరాచకాలను కంట్రోల్ చేయలేకపోతున్నాడు.
త్రిపురలో అమానుష ఘటన వెలుగుచూసింది. నవమాసాలు మోసి కనిపెంచిన కన్నతల్లిని కుమారులే కర్కశంగా సజీవదహనం చేసిన ఘటన దేశవ్యాప్తంగా కలచివేసింది. పశ్చిమ త్రిపురలోని చంపక్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖమర్‌బారిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
భారత ప్రభుత్వం, త్రిపుర ప్రభుత్వం, నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (NLFT), ఆల్ త్రిపుర టైగర్ ఫోర్స్ (ATTF) ప్రతినిధులు బుధవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో త్రిపుర శాంతి ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం తర్వాత.. తాము ప్రభుత్వాన్ని విశ్వసించామని ఎన్ఎల్ఎఫ్‌టీ (NLFT) తెలిపింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో మిజోరం, త్రిపురలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అల్పపీడనం ఆదివారం వాయువ్య దిశగా పయనించనుందని ఐఎండీ శాస్త్రవేత్త సోమసేన్ తెలిపారు.