Physical Harassment: కదులుతున్న కారులో కాలేజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Physical Harassment: రోజు రోజుకు కామాంధులు రెచ్చిపోతున్నారు. త్రిపురకు చెందిన ఒక కళాశాల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. పశ్చిమ త్రిపుర జిల్లాలో కదులుతున్న కారులో కళాశాల విద్యార్థినిపై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం విషమ స్థితిలో ఉన్న ఆమెను పశ్చిమ త్రిపురలోని అమాతలి బైపాస్ వద్ద వదలిపెట్టి పరారయ్యారు. సోమవారం తెల్లవారుజామున ఈ దారుణ ఘటన జరిగింది. ఈఘటనలో ప్రధాన నిందితుడైన గౌతమ్ శర్మ అనే వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు బుధవారం అతడిని ప్రశ్నించడం ప్రారంభించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రధాన నిందితుడు గౌతం శర్మ (26), నేరం చేసిన వాహనం డ్రైవర్ సుదీప్ చెత్రి (31) సంఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే అరెస్టు చేశారు. కాగా, మూడో నిందితుడు మహేశ్ కాలా ప్రాంతానికి చెందిన ప్తాడెన్‌జిత్ పాల్ (26)ను గురువారం అరెస్టు చేశారు.
సోమవారం రోజంతా ఆ బాలిక ప్రధాన నిందితుడితో కలసి వాహనంలోనే తిరుగుతూ కనిపించిందని, అయితే సోమవారం రాత్రి ఏకాంతంగా ఉండడం చూసి ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ప్రధాన నిందితుడు ఆమెను అమాతలి బైపాస్ సమీపంలో వదిలి పరారయ్యాడని సబ్‌డివిజనల్ పోలీసు అధికారి ఆశిష్ దాస్‌గుప్తా బుధవారం మీడియాకు తెలిపారు. ఆ బాలిక తరచు ప్రధాన నిందితుడితో మాట్లాడుతూ ఉండేదని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అయితే ఆమెపై అత్యాచారానికి పాల్పడింది ఒకరా లేక మరికొందరా అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది. కాగా, జీబీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన తర్వాత త్రిపురలో విద్యార్థులు, మహిళా సంఘాలతో సహా వివిధ సంస్థలు గురువారం నిరసన ప్రదర్శనలు నిర్వహించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పశ్చిమ త్రిపుర శివార్లలోని తన కళాశాల నుండి తిరిగి వస్తుండగా 20 ఏళ్ల విద్యార్థిని సోమవారం మధ్యాహ్నం అపహరణకు గురైంది.
Also Read
Read Also: Tihar Jail: 90 మంది తీహార్ జైలు అధికారులు ట్రాన్స్‌ఫర్.. గ్యాంగ్‌స్టర్ హత్య తరువాత కీలక పరిణామం
బాధిత బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. కాలేజ్ నుంచి ఇంటికి తిరిగివస్తున్న ఆమె కుమార్తెకు ఒక యువకుడు కారులో లిఫ్టు ఇవ్వచూపాడు. అందుకు అంగీకరించిన ఆమె కుమార్తె కారులో ఎక్కగా అందులోనే ఉన్న ముగ్గురు యువకులు ఆమెపై లైంగిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత అపస్మారక స్థితిలో ఉన్న ఆ బాలికను అమాతలి బైపాస్ వద్ద వదిలి పారిపోయారు. బంధువులు ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న బాలిక తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ వార్త తెలిసిన వెంటనే బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాపయ్య దత్తా, బీజేపీ మహిళా మోర్చా నాయకులు ఆస్పత్రికి వెళ్లి బాధితురాలి ఆరోగ్యం గురించి విచారించారు. ముఖ్యమంత్రి మాణిక్ సహా ఆదేశా ల మేరకే తాము బాధితురాలి వద్దకు వెళ్లినట్లు దత్తా తెలిపారు. ఈ సంఘటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, నిందితులకు కఠిన శిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు. బాధితురాలికి, ఆమె కుటుంబానికి అండగా బీజేపీ ఉంటుందని ఆయన చెప్పారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!