Election Counting Updates: త్రిపురలో అధికార బీజేపీ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ప్రస్తుతం 60 స్థానాలకు గాను 37 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న బీజేపీ సునాయాసంగా గెలుపు దిశగా పయనిస్తోంది.
Election Updates: త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని లుమ్లా అసెంబ్లీ నియోజకవర్గం, రామ్‌గఢ్ (జార్ఖండ్), ఈరోడ్ ఈస్ట్ (తమిళనాడు), సాగర్దిఘి (పశ్చిమ బెంగాల్) తదితర స్థానాలకు సంబంధించిన ఉప ఎన్నికల కౌంటింగ్ కూడా జరుగుతోంది.
Election Results: ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.
BJP To Win Big In Tripura, Nagaland, Show Exit Polls: ఈశాన్య రాష్ట్రాల్లో మళ్లీ కమలం విరబూస్తుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టంగా చెబుతున్నాయి. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాల్లో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అయితే మేఘాలయ రాష్ట్రంలో మాత్రం బీజేపీకి చుక్కెదురు అయ్యే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది.
త్రిపుర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ బర్నాలీ గోస్వామిపై భారతీయ జనతా పార్టీ (బీజేపి) కార్యకర్తలు మంగళవారం ధామ్‌నగర్‌లో దాడి చేశారు. దాడి చేసిన వారిలో కొందరు బీజేపీ కౌన్సిలర్లు కూడా ఉన్నారని ఆమె ఆరోపించారు.
ఎన్నికల నేపథ్యంలో త్రిపురలో బీజేపీ ప్రభుత్వ అభివృద్ధి పనులను హైలైట్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ సంచలన ప్రకటన చేశారు. ఈశాన్య రాష్ట్రం దక్షిణాసియాకు 'గేట్‌వే'గా మారడానికి సిద్ధంగా ఉందని ప్రధాని శనివారం అన్నారు.
ఎన్నికల నేపథ్యంలో త్రిపురలో జరిగిన ర్యాలీలో అసోం ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలోని రామజన్మభూమిలో బాబర్ ఆక్రమణను తొలగించి బీజేపీ రామమందిరాన్ని నిర్మించిందని బనమాలిపూర్‌లో జరిగిన బహిరంగ సభలో హిమంత బిస్వా శర్మ అన్నారు.
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల కోసం 48 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ శనివారం ప్రకటించింది. ధన్‌పూర్ నుంచి కేంద్ర మంత్రి ప్రతిమా భూమిక్‌ను బరిలోకి దింపింది.