Man Kills Minor Wife: త్రిపుర రాష్ట్రంలో ఘోరం జరిగింది. అగర్తాలలో 15 ఏళ్ల మైనర్ అయిన భార్యను అత్యంత దారుణంగా హత్య చేశాడు ఓ వ్యక్తి. మృతదేహాన్ని రెండు ముక్కలుగా నరికాడు. బాధితురాలు తనూజాబేగం శుక్రవారం ఉదయం నుంచి కనిపించకుండా పోయింది. గంటల తరబడి వెతికిన తర్వాత రెండు సంచుల్లో ఆమె మృతదేహం లభ్యమైంది. ఓ సంచితో తల, మరోసంచితో మిగతా శరీరం భాగం లభ్యం అయింది.
Read Also: SRH vs DC: (అభి)షేక్ ఆడించాడు.. 10 ఓవర్లలో ఎస్ఆర్‌హెచ్ స్కోరు ఇది!
తనూజా బేగంగకు కయెమ్ మియాతో ఎనిమిది నెలల క్రితం వివాహం జరిగినట్లు తనూజా తమ్ముడు బాపన్ మియా తెలిపారు. శుక్రవారం ఉదయం తనూజా తల్లికి తన కూతురు కనిపించకపోవడంతో, ఆమె నివాసం ఉంటున్న ముస్లింపారా ప్రాంతానికి వెళ్లింది. కూతురు కోసం వెతుకుతున్న సందర్భంతో ఆమెకు ఇంట్లో రక్తం మరకలు కనిపించాయి. ఆ సమయంలో తనూజ, ఆమె భర్త అక్కడ లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీస్ అధికారి ఆశిష్ దాస్ గుప్తా నేతృత్వంలోని పోలీస్ టీం సంఘటన స్థలానికి వెల్లి కయెమ్ మియా కోసం వెతకడం ప్రారంభించారు. కొన్ని గంటల తర్వాత అతను పోలీసుకు చిక్కాడు. గురువారం రాత్రి తనూజాను హత్యచేసి, ఆమె శరీర భాగాలను రెండు సంచుల్లో స్థానిక అటవీ ప్రాంతంలో ఉంచినట్లు విచారణలో వెల్లడించారు. అడవి నుంచి స్వాధీనం చేసుకున్న రెండు సంచుల్లో ఆమె తల ఓ సంచిలో, మిగతా శరీరం మరో సంచిలో లభించింది. ఫిర్యాదు అందిన నాలుగు గంటల్లోనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకు నేరం చేశాడనే విషయంపై పోలీసులు విచారణ సాగిస్తున్నారు. ఈ కేసులో మూడో వ్యక్తి ప్రమేయం ఉందా..? అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.