బీహార్‌లోని కైమూర్‌లో తీవ్ర విషాదం నెలకొంది. చెరువులో స్నానానికి దిగి ఐదుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. చనిపోయిన వారిలో నలుగురు అబ్బాయిలు ఉండగా.. ఒక అమ్మాయి ఉంది. స్థానికులు చెరువులో నుంచి మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటనతో చిన్నారుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఘటనాస్థలానికి చేరుకున్న చిన్నారుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా దు:ఖ సాగరంలో నిండిపోయింది.
దీపావళి పండుగ వేళ కోనసీమలో అపశృతి చోటుచేసుకుంది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం ఆవిడి కట్లమ్మ అమ్మవారి ఆలయం వద్ద పూరింటిపై తారాజువ్వ పడి అగ్ని ప్రమాదం సంభవించింది.
మెదక్ జిల్లాలో పండగ పూట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు పిల్లలతో స్కూటీపై వెళ్తున్న తల్లిని టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు కుమారులు మృతి చెందారు. తల్లి స్వల్ప గాయాలతో బయటపడింది.
ఊరి చెరువులో వ్యర్థ పదార్థాలు, చెత్తను తొలగించేందుకు నీటిలో దిగి ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు గల్లంతు అయ్యారు. ఈ విషాద ఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలం తీగుల్ గ్రామంలో చోటు చేసుకుంది.
చెరువులో మునిగి ముగ్గురు బాలికలు మృతి చెందిన ఘటన బీహార్లో చోటు చేసుకుంది. బరాహత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బభంగమా గ్రామంలో గురువారం మధ్యాహ్నం చెరువులో మునిగి ముగ్గురు బాలికలు చనిపోయారు. స్నానానికి చెరువు వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయారు.
ఆ చిన్నారి ఉదయాన్నే నిద్ర లేచింది. తలంటు స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుంది. పుట్టినరోజు కావడంతో కుటుంబసభ్యుల తీసుకుంది. పాఠశాలకు వెళ్లి అందరికి చాకెట్లు పంచింది. అయితే.. ఆ చిట్టితల్లికి తెలియదు.. పుట్టిన రోజే తనకు ఆఖరి రోజు అవుతుందని. పుట్టిన రోజున ఆనందంగా గడిపిన ఆ చిన్నారి విషాదకర రీతిలో మృతి చెందింది.
లడఖ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. శనివారం లడఖ్‌లోని లేహ్ జిల్లాలో వారి వాహనం రోడ్డుపై నుంచి లోతైన లోయలో పడిపోవడంతో తొమ్మిది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
పదేళ్లకే ప్రాణాంతక వ్యాధిబారిన పడింది. ఆ చిన్నారిని రక్షించేందుకు ఆమె తల్లిదండ్రులు ఎంతగానో ప్రయత్నించారు. కానీ అప్పటికే పరిస్థితులు చేజారిపోయాయి. ఆమె జీవితంలో ఇక కొన్ని రోజులే మిగిలి ఉన్నాయని తెలుసుకున్న తల్లిదండ్రులు.. ఆ చిట్టి తల్లి కోరికను నెరవేర్చాలనుకున్నారు.
ఆ తల్లి ఎన్ని ఆశలు పెట్టుకోందో... నవమాసాలు మోసి తల్లికి ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన సంతోషం ఎక్కువ సేపు నిలువలేదు ...కన్న బిడ్డలను కళ్ళారా చూసుకునేలోపు పుట్టిన ముగ్గురు పిల్లలు అనారోగ్యంతో మరి చెందడం అత్యంత విషాదాన్ని అకుటుంబంలో నింపింది.