Childrens died: బీహార్‌లోని కైమూర్‌లో తీవ్ర విషాదం నెలకొంది. చెరువులో స్నానానికి దిగి ఐదుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. చనిపోయిన వారిలో నలుగురు అబ్బాయిలు ఉండగా.. ఒక అమ్మాయి ఉంది. స్థానికులు చెరువులో నుంచి మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటనతో చిన్నారుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఘటనాస్థలానికి చేరుకున్న చిన్నారుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా దు:ఖ సాగరంలో నిండిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Read Also: Mahua Moitra: మహువా మొయిత్రాకు కొత్త బాధ్యతలు అప్పగించిన టీఎంసీ అధినేత్రి
ప్రమాదానికి గురైన పిల్లలందరి వయస్సు 7 నుండి 12 సంవత్సరాలుగా ఉంటుందని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గురైన పిల్లలను ధావ్‌పోఖర్ గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందినవారు. ఉపాధ్యాయుడు సుశీల్ రామ్‌కు చెందిన 12 ఏళ్ల అను ప్రియ, 10 ఏళ్ల అన్షు ప్రియ, 8 ఏళ్ల మధుగా గుర్తించారు. మరొకరు సునీల్ రామ్ కూతురు 4 ఏళ్ల అపూర్వ కుమారి, ఓ ఉపాధ్యాయురాలి 4 ఏళ్ల కుమారుడిగా గుర్తించారు. ఇదిలా ఉంటే.. మరో ముగ్గురు చిన్నారులను అక్కడి స్థానికులు కాపాడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం కరంచత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధవ్ పోఖర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: USA: విదేశాల్లో విద్య.. వరుసగా మూడో ఏడాది అగ్రస్థానంలో నిలిచిన అమెరికా