Girl Marries Boyfriend: పదేళ్లకే ప్రాణాంతక వ్యాధిబారిన పడింది. ఆ చిన్నారిని రక్షించేందుకు ఆమె తల్లిదండ్రులు ఎంతగానో ప్రయత్నించారు. కానీ అప్పటికే పరిస్థితులు చేజారిపోయాయి. ఆమె జీవితంలో ఇక కొన్ని రోజులే మిగిలి ఉన్నాయని తెలుసుకున్న తల్లిదండ్రులు.. ఆ చిట్టి తల్లి కోరికను నెరవేర్చాలనుకున్నారు. చివరి క్షణాల్లో ఆమెలో ఆనందం నింపడం కోసం వారు ప్రయత్నించారు. ఆ చిట్టి తల్లి కోరిక ఏంటంటే.. పెళ్లి చేసుకోవడం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా అదే నిజం. పెళ్లి చేసుకోవాలని కలలు కన్న అమెరికాకు చెందిన 10 ఏళ్ల బాలిక లుకేమియాతో చనిపోయే కొద్ది రోజుల ముందు తన చిన్ననాటి బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లి జరిగిన 12 రోజులకే చిన్నారి పరిస్థితి విషమించి కన్నుమూసింది. అమెరికాలో ఈ సంఘటన జరిగింది.
ALso Read: Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్ర రెండో దశ ప్రకటించిన కాంగ్రెస్.. ఈ సారి యాత్ర ఎక్కడి నుంచంటే?
అమెరికాలోని ఉత్తర కరోలినాలో అలీనా, ఆరోన్ ఎడ్వర్డ్స్ దంపతులకు పదేళ్ల ఎమ్మా ఎడ్వర్డ్స్ ఉంది. గత ఏడాది ఏప్రిల్‌లో అనారోగ్యం బారిన పడడంతో పరీక్షలు చేయించగా.. అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా (ALL) ఉన్నట్లు నిర్ధారణ అయింది. అయితే ఆమె తల్లిదండ్రులు, అలీనా, ఆరోన్ ఎడ్వర్డ్స్, ఆమె అనారోగ్యాన్ని అధిగమించగలదని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఏది ఏమైనప్పటికీ, జూన్‌లో ఎమ్మా క్యాన్సర్‌ను నయం చేయలేమని, ఆమె జీవించడానికి రోజులు మాత్రమే ఉన్నాయని కుటుంబ సభ్యులకు హృదయ విదారక వార్త తెలిసింది. ఆమెను కాపాడుకునేందుకు ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. కొన్ని రోజులే మిగిలి ఉన్నాయని వైద్యులు చెప్పారు. అయితే, తమ కుమార్తెను చివరి రోజుల్లో ఆనందంగా ఉంచాలనుకున్నారు. ఈ క్రమంలోనే.. నాకు పెళ్లి కావాలంటూ ఎప్పుడూ చెప్పే ఆమె మాటలను నిజం చేయాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా ఆమె స్నేహితుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఏర్పాట్లు చేశారు.
Also Read: America Heavy Rains: అమెరికాలో వర్ష బీభత్సం.. వేల విమానాలు రద్దు
ఈ క్రమంలోనే జూన్ 29న పెద్దఎత్తున బంధుమిత్రుల సమక్షంలో ఎమ్మా ఎడ్వర్డ్ స్నేహితుడైన డీజే విలియమ్స్‌లో నమూనా వివాహాన్ని ఘనంగా జరిపించారు. ఆ పెళ్లి జరిపించిన 12 రోజుల తర్వాత చిన్నారి కన్నుమూయడం విషాదకరం. సాధారణంగా ఆ వయస్సులోని పిల్లలకు డిస్నీలాండ్ వెళ్లాలని, ఏదైనా కొనాలని మారాం చేస్తారు.. కానీ నా కుమార్తె మాత్రం పెళ్లి చేసుకుంటానని చెప్పిందని.. ఈ క్రమంలో ఆమె కోరికను నెరవేర్చేలా మాక్ వెడ్డింగ్ జరిపించామని చిన్నారి తల్లి అలీనా తెలిపారు.