Tragedy: విషాదం.. కొలంబియాలో ఆంధ్రా యువకుడు అనుమానాస్పద మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy: ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరులో విషాదఛాయలు అలుముకున్నాయి. కొలంబియాలో ఆంధ్రా యువకుడు బేతపూడి సుధీర్ కుమార్ మృతి చెందాడు. జి.కొండూరు నుంచి వెళ్లి ప్రభుత్వ స్కాలర్‌షిప్‌తో స్పెయిన్‌లో సుధీర్ కుమార్ అలియాస్ జోషి ఉన్నత చదువులు పూర్తి చేశారు. 10రోజుల క్రితం జి.కొండూరు నుంచి స్పెయిన్ వెళ్తున్నానని చెప్పి సుధీర్ అక్కడికి వెళ్లిపోయారు. తర్వాత సోదరి జ్యోత్స్నకు ఫోన్ చేసి స్నేహితురాలు జెస్సికా పుట్టినరోజు వేడుకలకు వెళ్తున్నానని, సర్ ప్రైజ్ ఇస్తున్నానని సుధీర్ చెప్పినట్లు తెలిసింది. స్నేహితురాలు జెస్సికా పుట్టినరోజుకు కొలంబియా వెళ్లిన సుధీర్ కానరాని లోకాలకు వెళ్లిపోయినట్లు మృతుడి సోదరి వెల్లడించారు.
Also Read: Heavy Rains: నాగ్‌పూర్‌లో భారీ వర్షం.. స్కూళ్లు, కాలేజీలు మూసివేత
Also Read
- Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. పలు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు!
- Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
- Pakistan Afghanistan Conflict: అర్ధరాత్రి ఆఫ్గానిస్థాపై పాకిస్థాన్ ఎయిర్‌స్ట్రైక్స్.. ఇళ్లపై బాంబులు వర్షం..!
- Sandeep Patil: రోహిత్, కోహ్లీ లేకపోయినా టీమిండియాకు నష్టమేమీ లేదు.. మాజీ సెలెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
మృతుడి సోదరి వెల్లడించిన వివరాల ప్రకారం.. గత కొంతకాలంగా సుధీర్, జెస్సికా లివింగ్ రిలేషన్ షిప్‌లో ఉన్నారు. వారిద్దరి మధ్య గత మూడు నెలలుగా మనస్పర్థలు ఉన్నాయని సుధీర్ సోదరి తెలిపింది. ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడని 5రోజుల క్రితం ఫోన్ చేసి సుధీర్ సోదరి జ్యోత్స్నకు జెస్సికా చెప్పింది. చనిపోయే ముందు ఇండియాలో తన సోదరుడితో సుధీర్ మాట్లాడుతున్న వీడియో జ్యోత్స్నకు జెస్సికా పంపింది. అనంతరం సుధీర్ చనిపోయినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆత్మహత్యా?హత్యా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సుధీర్ మృతి చెంది 5రోజులు అవుతోంది. మృతి చెంది 5రోజులు గడుస్తున్నా కుటుంబసభ్యులకు చివరి చూపుకు ప్రయత్నాలు ఫలించలేదు. మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు కూడా ఆర్థిక స్ధోమత లేదంటూ కుటుంబం కన్నీటి పర్యంతమవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకుని కడచూపు కల్పించాలని కుటుంబసభ్యులు అభ్యర్థిస్తున్నారు. శోక సంద్రంలో మునిగిన కుటుంబసభ్యులు తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
తాజావార్తలు
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. పలు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు!
-
The Paradise: టైటిల్లోనే కాదు.. ‘పుష్ప’, ‘పెద్ది’, ‘ప్యారడైజ్’ కథల్లోనూ ఒకే కనెక్షన్.. సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా ?
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Pakistan Afghanistan Conflict: అర్ధరాత్రి ఆఫ్గానిస్థాపై పాకిస్థాన్ ఎయిర్‌స్ట్రైక్స్.. ఇళ్లపై బాంబులు వర్షం..!
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!