పెళ్లయి కొన్ని గంటలు కూడా కాలేదు. వధువు కాళ్ల పారాణి కూడా ఇంకా ఆరలేదు. ఇంతలోనే ఆ వధువును మృత్యువు పగబట్టింది. కాళ్ల పారాణి ఆరకముందే నవ వధువు మృతి చెందిన విషాద ఘటన పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం దెబ్బగడ్డ గ్రామంలో జరిగింది.
హోలీ పండగ పూట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో హోలీ ఆడిన తర్వాత స్నానం కోసమని వెళ్లి ఐదుగురు మృతి చెందారు. కొమురంభీం జిల్లా కౌటాల మండలం వార్ధా నదిలో స్నానానికి వెళ్లిన నలుగురు యువకులు గల్లంతు కాగా వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టి.. నాలుగు మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు. మృతులు నదిమాబాద్ కు చెందిన సంతోష్, ప్రవీణ్, కమలాకర్, సాయిగా గుర్తించారు. మృతదేహాలను కౌటాల ఆస్పత్రికి తరలించారు.…
నేటి సమాజంలో బంధాలకు విలువ లేకుండా పోతోంది. తమ కామవాంఛ తీర్చుకోవడానికి ఎంతటి దారుణానికైనా ఒడిగడుతున్నారు కొందు. అలాంటి ఘటనే ఇది. మేన బావతో అక్రమ సంబంధం పెట్టుకొని.. వారి అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తని హత్య చేయించింది ఓ భార్య… ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లాలోని పూడూరు మండలం చెన్గోముల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంకేపల్లి గ్రామ శివారులో ఈనెల 17న సంజీవ్ కుమార్ (38) అనే వ్యక్తిని…
పెళ్లి చేసుకుని హ్యాపీగా తన భాగస్వామితో జీవించాల్సింది.. ఇంకో నాలుగు రోజుల్లో పెళ్లి.. ఇంట్లో సంబరాలు, హడవుడి ఉండాల్సింది. విషాదఛాయలతో నిండిపోయింది. పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఓ యువకుడు విగతజీవిగా మారాడు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కుమ్మరిగూడెం శివారు ఎస్ఆర్ఎస్పీ కెనాల్ లో మృతదేహమై కనిపించాడు. దీంతో వరుడి మిస్సింగ్ మిస్టరీ విషాదాంతం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఈనెల 16వ తేదీన తన వివాహం జరగాల్సి ఉంది. నర్సంపేటకు చెందిన యువతితో కృష్ణతేజకు వివాహం…
కడప జిల్లా ప్రొద్దుటూరులో విషాదం చోటు చేసుకుంది. రాజుపాలెం వద్ద నదిలో మునిగి అక్క తమ్ముడు గల్లంతయ్యారు. స్నానం కోసం కుందూ నదిలో దిగి మస్తాన్(27), ఇమాంబి(28) లు మృతి చెందారు. కుందు నదిలో ఇసుక కోసం తవ్విన గుంతలో పడి అక్క తమ్ముడు మృతి చెందారు. మృతులు చాగలమర్రికి చెందినవారిగా గుర్తించారు.
ఆ యువకుడు అమెరికాకు వెళ్లేందుకు అంతా సిద్ధం చేసుకున్నాడు. కానీ ఇంతలోనే మృత్యువు ఆ యువకుడిని కబలించివేసింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మంథని గ్రామానికి చెందిన వేంపల్లి శ్రావణ్ గౌడ్ (27) సోమవారం రాత్రి 11.30 లకు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ తో ముగ్గురు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన పర్వతగిరి మండలం మోత్య తండాలో జరిగింది. విద్యుత్ షాక్ కు గురైన వారిలో మొత్తం నలుగురు యువకులు ఉన్నారు. కాగా.. మొదటగా భూక్యా దేవేందర్ అక్కడికక్కడే మృతి చెందగా.. గాయాలతో ఉన్న సునీల్, రవిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు.
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థినుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఇటీవలే తెలంగాణలోని భువనగిరి సాంఘీక వసతి గృహంలో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్య ఘటన మరువక ముందే ఆంధ్రప్రదేశ్ లో మరో ఘటన చోటు చేసుకుంది. తాజాగా.. అల్లూరి జిల్లా అరకు లోయలో హాస్టల్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
పెద్దపల్లి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. బరువుదెరువు కోసం వచ్చిన కొందరు ఒరిస్సాకు చెందిన కార్మికులు కలుషిత ఆహారం తిని బలయ్యారు. గౌరెడ్డి పేటలోని ఎమ్మెస్సార్ ఇటుకబట్టిలో పనిచేస్తున్న కార్మికులు కలుషిత ఆహారం తిని 20 మంది అస్వస్థత గురయ్యారు. దీంతో వెంటనే వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు కార్మికులు మృతి చెందారు. అయితే చికిత్స పొందుతున్న 14 మంది కార్మికుల పరిస్థితి విషమంగా ఉండడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రికి…