క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలకు జీవితాన్ని బలి తీసుకుంటున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న తమ తల్లిదండ్రుల కలలను చెరిపేస్తున్నారు. ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయని అనవసరంగా ప్రాణాలను వదిలేసుకుంటున్నారు. తాజాగా.. ఓ విద్యార్థి ఐఐటీ ఫలితాల్లో మార్కులు వచ్చాయని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.
కుటుంబంలో రేగిన కలతలు చివరకు రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్నాయి పల్నాడు జిల్లాలో ఓ కుటుంబంలో రేగిన వివాదం విషాదంగా మారింది. మాచర్ల మండలం నారాయణపురం తండాలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు కన్న తల్లి కోపానికి బలైయ్యారు.... కుటుంబ కలహాలతో కన్నతల్లి, తన ముగ్గురు పిల్లలకు, భర్తకు కూడా టీలో ఎలుకల మందు కలిపి ఇచ్చింది.
ఏపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కృష్ణానదిలో మునిగి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణానదిలో చోటు చేసుకుంది. సరదాగా స్నానానికి దిగడం కోసమని నదిలో దిగడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు పటమటకు చెందిన నడుపల్లి నాగ సాయి కార్తికేయ, కత్తి ప్రశాంత్ (13), ఇంటర్మీడియెట్ విద్యార్ది గగన్ గా గుర్తించారు. కాగా నదిలో స్నానానికి నలుగురు వెళ్లగా.. ఒకరు ప్రాణాలతో బయటపడ్డాడు. ముగ్గురు…
అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో భార్య మృతదేహాన్ని బంధువుల సాయంతో 20 కిలోమీటర్లు భుజాలపై మోసుకెళ్లిన దయనీయ ఘటన ఒడిశాలోని నవరంగపూర్ జిల్లాలో చోటుచేసుకుంది.
మహారాష్ట్రలోని గడ్చిరోలిలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, మరో ఐదుగురు గల్లంతయ్యారు. అయితే ఆ పడవలో మొత్తం ఏడుగురు మహిళలు ప్రయాణిస్తున్నారు. అందులో ఒకరిని రక్షించారు. మరొకరు మృతి చెందగా, మిగతా వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు.
కొత్తూరు మున్సిపాలిటీలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు నీటి బకెట్‌లో పడి 16 నెలల చిన్నారి మృతి చెందింది. దీంతో చిన్నారి కుటుంబంలో విషాదం నెలకొంది. కొత్తూరు మునిసిపాలిటీ లో బీహార్ రాష్ట్రానికి చెందిన ధర్మేందర్ చోబె దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. ధర్మేందర్ చోబె దంపతులు వస్త్ర కంపెనీలో పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే శనివారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు ఇంటి పనుల్లో నిమగ్నమై ఉండగా పెద్ద కూతురు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు అక్కడే…
నూతన సంవత్సర వేడుకలు ముగ్గురు యువకుల కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. ఏలూరు జిల్లాలో న్యూఇయర్ రోజున విషాదం చోటుచేసుకుంది. అగిరిపల్లి మండలం కనసానపల్లిలో మద్యం మత్తులో బుల్లెట్ బండి నడుపుతూ బావిలోకి దూసుకెళ్లాడు ఓ యువకుడు. బుల్లెట్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులలో ఇద్దరు మృతి చెందగా.. మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి.
పంజాబ్ లో న్యూ ఇయర్ వేళ విషాదం నెలకొంది. జలంధర్ జిల్లా అదంపూర్‌లోని ఒక గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు తమ ఇంట్లో శవమై కనిపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కోతిని మనం దైవంగా భావిస్తాం. కానీ ఇప్పుడు ఆ కోతి మనకు చుక్కలు చూపిస్తోంది. పర్యావరణ సమతుల్యత దెబ్బతినడంతో అడవుల్లో ఉండాల్సిన కోతులు ఊళ్లలోకి చొరబడి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చాలా జిల్లాల్లో కోతుల బెడద ఎక్కువైపోయింది.
కర్ణాటకలోని కలబురిగి జిల్లాలో అఫ్జల్పూర్ తాలూకాలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రమాదవశాత్తూ వేడివేడిగా ఉన్న సాంబార్ పాత్రలో పడిన మూడు రోజుల తర్వాత రెండో తరగతి విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది.