Hyderabad: హైదరాబాద్ లోని మణికొండలో విషాద ఘటన చోటుచేసుకుంది. తల్లీకూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాల కారణంగా తల్లీ, కూతురు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆత్మహత్య చేసుకున్న వారిని అలువేలు (40), లాస్య (14) గా గుర్తించారు.
సికింద్రాబాద్ బన్సీలాల్‌పేటలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయంలో ఈ ఘటన జరిగింది. కుమారుడు, కూతురిని భవనం 8వ అంతస్తు నుంచి కిందపడేసిన అనంతరం.. తల్లి భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతుల్లో ఇద్దరు పిల్లలు కవలలుగా గుర్తించారు.
చిత్తూరు జిల్లా కుప్పం మండలం తంబిగానిపల్లెలో విషాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్‌తో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. శవాన్ని అంత్యక్రియలకు తీసుకెళ్తుండగా.. విద్యుత్ తీగలు తగలడంతో షాక్ కొట్టి ముగ్గురు మృతి చెందారు.
Haliya: తల్లిని మించిన దైవం లేదు. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎంత బాధనైనా భరిస్తూ మనకు జన్మనిస్తుంది. మనకు కష్టమొచ్చిందంటే తల్లిపేగు విలవిలలాడిపోతుంది.
దక్షిణ పెరూలోని మారుమూల ప్రాంతంలోని బంగారు గనిలో జరిగిన అగ్ని ప్రమాదంలో కనీసం 27 మంది కార్మికులు మరణించారని అధికారులు ఆదివారం తెలిపారు. ఇది దేశ ఇటీవలి చరిత్రలో అత్యంత ఘోరమైన మైనింగ్ విషాదాలలో ఒకటిగా నిలిచింది. దుఃఖంలో మునిగిన బంధువులు తమ ప్రియమైనవారి వార్తల కోసం గని దగ్గర గుమిగూడారు.
నగరంలోని బోరబండ పరిధిలోని రహమత్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి నిర్మాణంలో ఉన్న ఓ భవనం గోడ కూలిపోయింది. దీంతో పక్కనే ఉన్న ఇంటిపై ఇటుకలు పడ్డాయి. దీంతో ఆ ఇంట్లో ఉన్న నెల పాప మృతి చెందింది.
నారాయణపేట జిల్లా బోయిన్ పల్లిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లి ముగ్గు చిన్నారులు సహా ఓ మహిళ మృతి చెందారు. చెరువులో మునిగిపోతున్న పిల్లలను కాపాడే ప్రయత్నంలో తల్లి సురేఖ కూడా ప్రాణాలు కోల్పోయింది.
Crime News: హైదరాబాద్ లోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మర్డర్ కలకలం సృష్టించింది. ఉస్మాన్ నగర్ కు చెందిన మామా జఫర్ కుమారుడు పైసల్ ఈనెల 12న అర్ధరాత్రి 9 గంటల సమయంలో ఇంటి నుంచి ఉస్మానియా హోటల్ వెళుతున్నాను అని చెప్పి వెళ్లాడు.