మహారాష్ట్రలోని గడ్చిరోలిలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, మరో ఐదుగురు గల్లంతయ్యారు. అయితే ఆ పడవలో మొత్తం ఏడుగురు మహిళలు ప్రయాణిస్తున్నారు. అందులో ఒకరిని రక్షించారు. మరొకరు మృతి చెందగా, మిగతా వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Reade Also: Stock Markets: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 1000.. నిఫ్టీ 300 పాయింట్లకు పైగా లాస్..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చమోర్షికి మిర్చి కోసేందుకు ఏడుగురు మహిళలు వెళ్తుండగా వనగంగా నదిలో ప్రమాదవశాత్తు బోటు బోల్తా పడింది. ఈ ఘటనలో పడవ నడిపించే వ్యక్తి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా, మహిళలు మునిగిపోయారు. అయితే.. స్థానిక ఈతగాళ్ల సహాయంతో రెస్క్యూ టీం గల్లంతైన మహిళల కోసం గాలిస్తోంది. కాగా.. మృతురాాలి వివరాలు, గల్లంతైన వివరాలు తెలియాల్సి ఉంది.
Reade Also: Chinese Army: ‘జై శ్రీరామ్.. జై శ్రీరామ్’ అంటూ చైనా ఆర్మీ నినాదాలు.. వీడియో వైరల్