Tragedy: కోతిని మనం దైవంగా భావిస్తాం. కానీ ఇప్పుడు ఆ కోతి మనకు చుక్కలు చూపిస్తోంది. పర్యావరణ సమతుల్యత దెబ్బతినడంతో అడవుల్లో ఉండాల్సిన కోతులు ఊళ్లలోకి చొరబడి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చాలా జిల్లాల్లో కోతుల బెడద ఎక్కువైపోయింది. ఈ నేపథ్యంలో కోతులపై కోపంతో వాటిని కొందరు వేటాడుతున్నారు. కోతుల కోసం కాల్పులు జరిపితే అమాయకుడు ప్రాణాలు బలి అయిన ఘటన ఏపీలోని అల్లూరి జిల్లాలో చోటుచేసుకుంది.
Read Also: Atrocious: కదులుతున్న రైలులో మహిళపై అత్యాచారం.. మధ్యప్రదేశ్‌లో ఘటన
ఈ నెల 5న పాడేరుఘాట్ లో ద్విచక్రవాహనదారుడు అనుమానాస్పద మృతి కేసును పోలీసులు చేధించారు. కోతులను నాటు తుపాకీతో వేటగాడు సుబ్బారావు కాల్చగా.. అది వెళ్లి ఓ వ్యక్తికి తగిలినట్లు పోలీసులు గుర్తించారు. కోతులకు గురిపెట్టిన బుల్లెట్‌లు తగిలి కాంట్రాక్టర్ శ్రీధర్ మృతి చెందినట్లు వెల్లడించారు. వైద్య పరీక్షల్లో సెల్ఫ్ యాక్సిడెంట్‌గా నిర్ధారించారు వైద్యులు. పోలీసుల ఎదుట నాటు తుపాకీతో నిందితుడు లొంగుబాటుతో న కాల్పులు వ్యవహారం వెలుగులోకి వచ్చింది.