అభం శుభం తెలియని రెండేళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి నీటితొట్టిలో పడి ఊపిరి ఆడక మృత్యువాత పడ్డాడు. ఇంటి అవసరాల కోసం తవ్విన నీటితొట్టె బాలుడి పాలిట యమపాశంగా మారింది.
గుజరాత్లో తీవ్ర విషాదం నెలకొంది. పోయిచా గ్రామాన్ని సందర్శించేందుకు వచ్చిన ఆ ఏడుగురిని మృత్యువు వెంటాడింది. మంగళవారం నర్మదా నదిలో ఆరుగురు బాలురుతో పాటు ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. కాగా.. అది చూసిన స్థానికులు భయంతో అరుపులు, కేకలు వేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్మదా నదిలో స్నానం చేసేందుకని అందులోకి దిగారని, అయితే లోతు ఎక్కువగా ఉండటంతో అందులో మునిగిపోయినట్లు చెబుతున్నారు. కాగా.. వారి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
ఇండోనేషియాలోని జావా ద్వీపంలో హైస్కూల్ విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సు కారు, మూడు మోటార్‌సైకిళ్లను ఢీకొట్టడంతో 11 మంది మరణించగా.. చాలా మంది గాయపడ్డారు.
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం దొనబండ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలోని క్వారీలలో ఉన్న నీటిగుంటలో పడి ఇద్దరు మహిళలు మృతి చెందారు. వారిద్దరు అక్కాచెల్లెళ్లని తెలిసింది.
Tragedy in Medchal: మేడ్చల్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లా పరిధిలోని బాచుపల్లి రేణుకా ఎల్లమ్మ కాలనీలో భారీ వర్షానికి నిర్మాణంలో ఉన్న గోడ కూలిపోయింది.
అన్నమయ్య జిల్లా గాలివీడు మండల కేంద్రంలోని చిలకలూరిపేటలో విషాదం చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లలతో సహా తల్లి చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. చెరువుకట్ట పై నుంచి పిల్లలతో పాటు దూకి మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం అంకన్నగూడెం గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అంకన్నగూడెంలో ఇద్దరు పిల్లలకు పాలడబ్బాలో పురుగుల మందు కలిపి తాగించి కిరాతకంగా హత్య చేసిన తల్లిదండ్రులు కందగట్ల అనిల్-దేవి దంపతులు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
సెలవు రోజులు జలగండాలవుతున్నాయి. సరదాతో కొందరు, ప్రమాదవశాత్తు మరికొందరు మృత్యువాత పడుతున్న ఘటనలు ఇటీవల ఎక్కువవుతున్నాయి. తాజాగా ఆదివారం రోజున ఇద్దరు అన్నదమ్ములు చెరువులో ఈతకు వెళ్లి మృతి చెందిన విషాద ఘటన చిత్తూరు జిల్లా సదుంలో చోటుచేసుకుంది.
చిత్తూరు జిల్లా రూరల్ మండలం పచ్చనపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. ఇద్దరు చిన్నారుల ఈత సరదా గ్రామాన్ని శోక సముద్రంలో ముంచింది. పదో తరగతి పరీక్షలు పూర్తి చేసుకున్న విద్యార్థులు.. ఈత సరదా కోసం సమీపంలోని చెరువుకు వెళ్లారు. అయితే.. చెరువులో బురద ఎక్కువగా ఉండటంతో అందులో చిక్కుకుని ఇద్దరు బాలురు సంజయ్(15), ఆకాష్ (15) మృతి చెందారు. ఇది గమనించిన స్థానికులు.. చెరువు వద్దకు వెళ్లి రక్షించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఫలితం లేక పోయింది.…